శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : సోమవారం, 8 ఫిబ్రవరి 2021 (23:03 IST)

అమితాబ్‌కు 46 ఏళ్ళ మ‌ధుర‌మైన అనుభ‌వం, కింద మెట్టును మర్చిపోలేదు

Amitab bachchan,Mayday location
సినిమా న‌టుడిగా ఆరంభంలో షూటింగ్ చేసిన లొకేష‌న్ అప్పుడ‌ప్పుడు అదేచోట చేయ‌డం మామూలే. కానీ కెరీర్ ప్రారంభంలో చేసిన షూటింగ్ మ‌ర‌లా 46 ఏళ్ళ త‌ర్వాత చిత్రంగా ఫిబ్ర‌వ‌రి 8నే జ‌ర‌గ‌డం మామూలు విష‌యం కాదు. ఇటీవ‌లే చిరంజీవి, ముర‌ళీమోహ‌న్‌, శ‌ర‌త్‌కుమార్‌లు ఫిలింసిటీలో ఒకేచోట షూటింగ్‌లు వేరువేర‌యినా ఒక్క‌సారిగా ఒకేరోజు క‌ల‌వ‌డం విశేషంగా ముర‌ళీమోహ‌న్  చెప్పారు. అలాంటిది అమితాబ్‌కు త‌న షూటింగ్ త‌నే మ‌ర‌లా 46 ఏళ్ళ త‌ర్వాత ఆ పాత భ‌వంతిని ఆ చుట్టుప్ర‌క్క‌ల వుండ‌డం మ‌ధురానుభూతి క‌లిగింద‌ని ట్వీట్ చేశారు.
 
ఆ ప్లేస్ క‌లిపింది `మే డే` సినిమా షూటింగ్‌. అజయ్‌ దేవగణ్‌ దర్శకత్వం వ‌హించ‌డ‌మే కాకుండా ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కథానాయిక. ప్రస్తుతం అమితాబ్‌పై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ముంబయిలోని ఓ ప్రాచీన భవంతి దగ్గర షూట్‌ చేసిన కొన్ని దృశ్యాల్ని సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్నారు అమితాబ్‌.

1975లో ఇదే లొకేషన్‌లో ‘దీవార్‌’ సినిమా చిత్రీకరణలో పాల్గొన్నారాయన. ‘అదే కారిడార్‌.. అదే ప్రాంతం.. నా ఎన్నో చిత్రాలు ఇక్కడే షూటింగ్‌ జరుపుకొన్నాయి. ఈ రోజు ఇలా! దీవార్‌ సినిమాలో శశికపూర్‌ (రవివర్మ) తన సోదరుడు అమితాబ్‌ (విజయ్)ని షూట్‌ చేసే సన్నివేశం ఇక్కడే చిత్రీకరించారు. ఇప్పుడు అక్కడే  ‘మేడే’ షూటింగ్‌ జరుగుతుండటం గొప్ప అనుభూతి ’అని ట్వీట్‌ చేశారు. దానికి అభిమానులు కూడా చ‌క్క‌గా రియాక్ట్ అయ్యారు. అమితాబ్ ఆ భ‌వంతి మెట్టు ఎక్కుతూ వున్న ఫొటోను చూసి బిగ్‌బి ఒక్కోమెట్టు ఎక్కినా కింద మెట్టును మ‌ర్చిపోలేద‌ని కామెంట్ చేశారు.