ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 1 జూన్ 2020 (13:46 IST)

తెలుగు వెండితెరపై మరో బయోపిక్ - ధృవీకరించిన కోన వెంకట్

తెలుగు వెండితెరపై మరో బయోపిక్ ఆవిష్కృతం కానుంది. ఈ విషయాన్ని ప్రముఖ రచయిత కోన వెంకట్ ధృవీకరించారు. భారత మల్లయోధురాలు, ఒలింపిక్స్ పతక విజేత కరణం మల్లీశ్వరి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ విషయాన్ని మల్లీశ్వరి పుట్టిన రోజైన జూన్ ఒకటో తేదీని పురస్కరించుకుని కోన వెంకట్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. 
 
జూలై ఒకటో తేదీ సోమవారం కరణం మల్లీశ్వరి పుట్టిన రోజు కాగా, మరో నిర్మాత ఎంవీవీ సత్యనారాయణతో కలిసి ఎంవీవీ సినిమా, కేఎఫ్సీ (కోనా ఫిల్మ్ కార్పొరేషన్) ఈ సినిమాను నిర్మించనున్నట్టు కోన వెంకట్ తెలిపారు. ఇది పాన్ ఇండియా చిత్రమని ఆయన స్పష్టం చేశారు. 
 
సినిమాలో కరణం మల్లీశ్వరి పాత్రను చేసే హీరోయిన్ ఎవరన్న విషయమై ఆయన ఎటువంటి స్పష్టతనూ ఇవ్వలేదు.  ఈ సినిమాకు సంజనా రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. సినిమాలో నటీనటులు, ఇతర వివరాలు తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగక తప్పదు.
 
కాగా, భారతదేశం తరపున ఒలింపిక్స్ పోటీల్లో పతకం సాధించిన తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. 2000 ఒలింపిక్స్‌లో మల్లీశ్వరి భారత ఖ్యాతిని దిగంతాలకు వ్యాపింపజేసిన సంగతి తెలిసిందే.