సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 1 సెప్టెంబరు 2023 (17:54 IST)

ఆదిత్య గంగసానిని ఘన్ను భాయ్‌ గా పరిచయం చేసిన అభిషేక్ నామా

Aditya Gangasani
Aditya Gangasani
అద్భుతమైన ప్రాజెక్ట్‌లని నిర్మిస్తున్న ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అభిషేక్ పిక్చర్స్‌ అభిషేక్ నామా, వెరీ ట్యాలెంటెడ్ ఆదిత్య గంగసానిని హీరోగా పరిచయం చేస్తూ కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. ప్రణయ్ మైకల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది. దేవాన్ష్ నామా సమర్పిస్తున్న ఈ చిత్రానికి ‘ఘన్ను భాయ్’ అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టారు
 
మేకర్స్ ఈ రోజు సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఫస్ట్ లుక్ మాస్ అవతార్‌లో ఆదిత్య గంగసానిని ప్రజెంట్ చేస్తోంది. ఆదిత్య డ్రమ్స్ కొడుతూ కనిపించి ఫుల్ ఎనర్జీతో వున్నారు.  ‘ఇస్మార్ట్ కా బాప్’ అనేది సినిమా ట్యాగ్‌లైన్. ఫస్ట్ లుక్ పోస్టర్ కలర్ ఫుల్ గా ఆకట్టుకొని మంచి ఇంప్రెషన్  కలిగించింది.
 
ఈ చిత్రానికి యంగ్ టెక్నికల్ టీం పని చేస్తోంది. అభే సంగీతం అందించగా, గోకుల్ భారతి కెమెరామెన్ గా పని చేస్తున్నారు. ఎడిటర్‌గా అమర్‌రెడ్డి కుడుముల, ప్రొడక్షన్‌ డిజైనర్‌గా గాంధీ నడికుడికార్‌ పని చేస్తున్నారు.మ మోహిత్ రౌలియాని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కాగా, వాసు పోతిని సీఈఓ.
 8 మార్చి 2024న  ఈ సినిమా విడుదల కానుంది.