బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 5 జులై 2023 (11:20 IST)

నందమూరి కళ్యాణ్ రామ్ పుట్టినరోజున డెవిల్ అప్ డేట్

Devil new poster
Devil new poster
నేడు నందమూరి కళ్యాణ్ రామ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ డెవిల్ గ్లిమ్ప్స్ విడుద జేసింది. కథగా చెప్పాలంటే, డెవిల్ - ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ శ్రీకాంత్ విస్సా రాసిన పీరియడ్ యాక్షన్ డ్రామా. నవీన్ మేడారం దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో నందమూరి కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్, సత్య అక్కలు ప్రధాన పాత్రలు పోషించారు. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మించగా హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు.
 
ఈరోజు ఓ పోస్టర్ విడుదల చేశారు. పంచె కట్టుతో రెండు చేతులతో వంకీలు తిరిగిన చుర కత్తులల్తో ఆవేశంగా ఉన్న ఫోటోను విడుదల చేసారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.  విడుదల తేదీ ప్రకటించనున్నారు.