శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 29 మార్చి 2023 (16:12 IST)

క్లైమాక్స్‌ చిత్రీక‌రణలో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌ డెవిల్ యాక్షన్ ఎపిసోడ్

Nandamuri Kalyan Ram
Nandamuri Kalyan Ram
నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న చిత్రం డెవిల్’. ‘ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ ట్యాగ్ లైన్. ఈ చిత్రం కోసం యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణ జరుగుతోంది. 500 మంది ఫైటర్స్‌తో క్లైమాక్స్‌ను చిత్రీక‌రిస్తున్నారు.  ఫైట్ మాస్ట‌ర్ వెంక‌ట్ ఆధ్వ‌ర్యంలో డిజైన్ చేశారు. దేవాన్ష్‌ నామా సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై న‌వీన్ మేడారం ద‌ర్శ‌క‌త్వంలో అభిషేక్ నామా ఈ పీరియాడిక్ డ్రామాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఫైన‌ల్ స్టేజ్‌కు చేరుకుంది. 
 
ఈ సంద‌ర్భంగా నిర్మాత అభిషేక్ నామా మాట్లాడుతూ, సినిమా అనుకున్న ప్లానింగ్ ప్ర‌కారం జ‌రుగుతుంది. ప్ర‌స్తుతం ఈ సినిమా క్లైమాక్స్‌ను చిత్రీక‌రిస్తున్నారు. దీన్ని సిల్వ‌ర్ స్క్రీన్‌పై చూస్తే వావ్ అనేంత గొప్ప‌గా పిక్చ‌రైజేష‌న్ ఉంటుంది.  త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌ను తెలియ‌జేస్తాం’’ అన్నారు. 
సౌంద‌ర్ రాజన్‌.ఎస్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్ సంగీతాన్ని ... శ్రీకాంత్ విస్సా కథ,స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు.