గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 19 ఏప్రియల్ 2023 (19:25 IST)

రావణాసుర కు సీక్వెల్ ఆలోచన లేదు : నిర్మాత అభిషేక్ నామా

Producer Abhishek Nama, vasu and others
Producer Abhishek Nama, vasu and others
రవితేజ తో నిర్మాత అభిషేక్ నామా నిర్మించిన రావణాసుర ఆశించినంతగా ఆడలేదు. మేము అనుకున్నట్లు ఫలితం రాలేదని అన్నారు. సీక్వెల్ ఆలోచన లేదన్నారు. ఈరోజు ఆయన  పుట్టినరోజు. అందుకే  ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా తన పుట్టినరోజు పురస్కరించుకుని ఫిల్మ్ నగర్ లోని తన ఆఫీస్ ప్రాంగణంలో మొక్కలు నాటారు.  
 
ఈ సందర్భంగా అభిషేక్ నామ మాట్లాడుతూ పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు.పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు.ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటే అవకాశం కల్పించినందుకు ఎంపీ సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో నిర్మాతలు వాసు,మోహిత్,బిల్డర్ సుధాకర్,ఎగ్జిక్యూటివ్ వాహబ్ పాల్గొన్నారు..