బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 24 సెప్టెంబరు 2024 (16:47 IST)

ఆచార్య సినిమా పరీక్షలో ఫెయిల్ అయ్యా - అందుకే దేవర బాగా రాశా :కొరటాల శివ

Chiru- siva
Chiru- siva
ఎన్.టి.ఆర్. దేవర  సినిమాను తీసేటప్పుడు గతంలో ఫెయిల్యూర్ ఇచ్చిన చిరంజీవితో తీసిన ఆచార్య సినిమాను బేరీజు వేసుకున్నారు. ముందు పరీక్ష సరిగ్గా రాయలేకపోతే తర్వాత పరీక్ష బాగా రాయాలనుకుంటాం. నేను దేవర విషయంలో అదే చేశాను. కారణాలు ఏమిటనేవి ఇప్పుడు అవసరంలేదని దర్శకుడు కొరటాల శివ నొక్కిచెప్పారు.
 
కాగా, ఆచార్య సినిమా విడుదలకాగానే మొదటగా మెసేజ్ పెట్టింది చిరంజీవిగారే. నువ్వు రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగాలి అని ఆయన చెప్పారు. దాన్ని కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు. నాకు ఆయనకూ మంచి బాండింగ్ వుందని అన్నారు.
 
జాన్వీకపూర్ గురించి చెబుతూ, ఆమెను సినిమాలో తీసుకోవడమేది యాద్రుశ్చికమే. ముందుగా ప్లాన్ వేసుకుని చేయలేదు. కానీ ఆమె ఎన్.టి.ఆర్. తో నటించాలనే కోరికను ముందుగానే సోషల్ మీడియాలో చెప్పింది. తను డైలాగ్స్ ముందుగానే పంపమని చెప్పేది. ఆమె సెట్లో వచ్చాక ఆమె డిక్షన్, నటన చూసి ఎన్.టి.ఆర్. ఆశ్చర్యపోయేవాడు. 
 
కాగా, దేవర సినిమా ఒకపార్ట్ అనుకున్నాం. కానీ కథ పెద్దది కావడంతో రెండు భాగాలు చేయాల్సివచ్చింది. అంతేకానీ మూడు, నాలుగు భాగాలు అనేవి వుండవు అని తేల్చిచెప్పారు.