పవన్‌కళ్యాణ్‌తో నటించడం మిస్ ఫైర్ అయింది: ఖుష్బూ
నటిగా కెరీర్ ఆరంభంలో డాన్స్‌లు, ఎక్స్‌పోజింగ్ పాత్రలు చేశాను. ఇప్పుడు అవి తలచుకుంటే తనకేమీ సిగ్గుఅనిపించడంలేదని నటి ఖుష్బూ తెలియజేసింది. అలాంటి పాత్రలు చేయడం అనేది నటిగా నా బాధ్యత. నేను 37ఏళ్ళక్రితం కలియుగ పాండవులులో నటించాను. ఇప్పటికీ నన్ను గుర్తుపెట్టుకుని అవకాశాలు ఇస్తున్నారంటే నేను గతంలో చేసిన పాత్రలు అన్నీ చెడ్డవని కాదుగా అంటూ సమాధానమిచ్చింది.
తాజాగా గోపీచంద్‌తో రామబాణంలో నటించిన ఆమె కుటుంబానికి ఎవరైనా ఆపద తలపెడితే శివంగిలా మారతానంటూ తెలియజేసింది. అయితే ఇంతకుముందు నేను చేసిన కొన్ని పాత్రులు మిస్ ఫైర్ అయ్యాయి. అలాంటిదే పవన్ కళ్యాణ్‌కు తల్లిగా అజ్ఞాతవాసిలో చేయడం. దర్శకుడు ఈక్వెషన్ ఎందుకనో బెడిసి కొట్టింది. కానీ రామబాణంలో అలా బెడిసికొట్టదని అనుకుంటున్నానని తెలిపింది.