బైక్ స్టంట్‌లో గాయపడిన తమిళ హీరో అజిత్.. హైదరాబాద్‌లో చికిత్స

ajith
ఠాగూర్| Last Updated: గురువారం, 19 నవంబరు 2020 (21:09 IST)
తమిళ అగ్రహీరోల్లో ఒకరైన అజిత్ మరోమారు గాయపడ్డారు. తనకు ఇష్టమైన బైక్ స్టంట్ చేస్తూ అదుపుతప్పి బైక్ పడిపోవడంతో ఆయనకు గాయాలయ్యాయి. దీంతో ఆయన్ను హుటాహుటిన హైదరాబాద్‌లోని ఓ కార్పొరేటర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ప్రస్తుతం అజిత్ వలిమై అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ చిత్రం షూటింగ్ సందర్భంగా ఆయన ప్రమాదానికి గురయ్యారు. డూప్ లేకుండా బైక్‌తో రిస్కీ స్టంట్ చేస్తుండగా ప్రమాదం జరిగింది.

ప్రమాదంలో అజిత్ చేతులకు, కాళ్లకు గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఆయనను నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అజిత్ గాయపడ్డారనే వార్తతో ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అజిత్ గాయపడటంతో షూటింగుకు కొన్ని రోజుల పాటు దూరం కానున్నాడు.

కాగా, 'వలిమై' సినిమాలో అజిత్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్న విషయం తెల్సిందే. హెచ్.వినోద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. బోనీ కపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రంలో అజిత్‌కు జోడిగా హ్యూమా ఖురేషి నటిస్తోంది.దీనిపై మరింత చదవండి :