సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 7 జూన్ 2018 (12:44 IST)

శ్రీదేవి, భూమిక, నిత్యమీనన్ ఆ కోవలోకి వస్తారు: నటి అపూర్వ

క్యాస్టింగ్ కౌచ్‌పై గళమెత్తిన శ్రీరెడ్డికి నటి అపూర్వ మద్దతు పలికిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అపూర్వ మాట్లాడుతూ.. ఎస్ఎస్ రాజమౌళి లాంటి దర్శకుడి సినిమాలో నటిస్తే అమ్మాయిలకు ఎలాంటి ఇబ్బందులు

క్యాస్టింగ్ కౌచ్‌పై గళమెత్తిన శ్రీరెడ్డికి నటి అపూర్వ మద్దతు పలికిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అపూర్వ మాట్లాడుతూ.. ఎస్ఎస్ రాజమౌళి లాంటి దర్శకుడి సినిమాలో నటిస్తే అమ్మాయిలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పారు. వారి దృష్టి పనిమీదే వుంటుందని.. ఇండస్ట్రీలో 60శాతం మంచి వారు వుంటే 40 శాతం మంచి చెడు వ్యక్తులు కూడా వున్నారని అపూర్వ అన్నారు. 
 
శ్రీదేవి అవకాశాల కోసం వెతికిన సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొని వుంటారేమో కానీ, స్టార్ డమ్ వచ్చాక ఆమె వెంట దర్శకనిర్మాతలు పడ్డారని.. ఆమె కోసం షూట్ కేసులతో వెయిట్ చేశారన్నారు. ఇండస్ట్రీలో అందరూ చెడ్డవారు ఉండరని అపూర్వ తెలిపింది. హీరోయిన్ భూమిక చాలా మంచి అమ్మాయి, స్ట్రిక్ట్‌గా ఉంటుందని అపూర్వ అన్నారు.
 
కనీసం హీరోలతో అయినా ఆమెని మాట్లాడించడానికి భయపడేవారని అపూర్వ తెలిపింది. ఇక నిత్యామీనన్‌ కూడా మంచి అమ్మాయని అపూర్వ చెప్పారు. అల్లరి చిత్రానికి ముందు కమిట్‌మెంట్‌కు ఒప్పుకోకపోవడంతో వేధింపులు ఎదురయ్యాయని.. కానీ అల్లరి చిత్రం హిట్టయ్యాక తనని ఎవరూ వేధించలేదని అపూర్వ అన్నారు. సింపుల్ లాజిక్ ఏంటంటే.. స్టార్ డమ్ వచ్చాక సినీ ఇండస్ట్రీలో వేధింపులు వుండవని.. స్టారడమ్ రాకముందు వేధింపులు వుంటాయని అపూర్వ చెప్పారు.