దిలీప్ శంకర్ ఇక లేరు.. హోటల్ గది నుంచి దుర్వాసన రావడంతో..?
మలయాళ నటుడు దిలీప్ శంకర్ ఇక లేరు. అమ్మయారియతే, పంచాగ్ని చిత్రాలలో నటించి గుర్తింపు సంపాదించిన దిలీప్ శంకర్.. డిసెంబర్ 29, 2024న తన తిరువనంతపురం హోటల్ గదిలో చనిపోయాడు.
టీవీ సీరియల్ షూటింగ్ కోసం దిలీప్ చనిపోవడానికి 4 రోజుల ముందు హోటల్‌కి వెళ్లాడు. అతని గది నుండి దుర్వాసన రావడంతో హోటల్ సిబ్బంది అతని మృతదేహాన్ని కనుగొన్నారు.
ఆయన మరణానికి సంబంధించిన ఆనవాళ్లు లేవని పోలీసులు తెలిపారు. దిలీప్ సహచరులు అతనిని కలిసేందుకు ప్రయత్నించారు. కానీ వారు హోటల్‌కి వెళ్లి చూడగా అతను శవమై కనిపించాడు. అతని మరణానికి 6 రోజుల ముందు ప్రవీంకూడు షాపు చిత్రాన్ని ప్రమోట్ చేశారు.
దిలీప్ మృతికి గల కారణాలు స్పష్టంగా తెలియనప్పటికీ, ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.