హర్షవర్ధన్ రాణేకు కోవిడ్ పాజిటివ్..
నటుడు హర్షవర్ధన్ రాణేకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యంది. పుల్కిత్ సామ్రాట్, కృతి కర్బందా, జిమ్ సర్బ్‌తో కలిసి ''తైష్'' చిత్రంలో రాణే నటించాడు. రివెంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం జీ5లో యాప్‌లో అక్టోబర్ 29న విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో కోవిడ్ పాజిటివ్ రావడంతో ఆయన సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా ధ్రువీకరించారు. జ్వరం, కడుపు నొప్పి ఉండగా.. దవాఖానకు వెళ్లే కొవిడ్ పరీక్షలు చేయగా.. పాజిటివ్‌గా తేలిందని పేర్కొన్నారు. దీంతో సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు.
ఇకపోతే.. హర్షవర్ధన్ రాణే బాలీవుడ్‌తో పాటు తెలుగులో పలు చిత్రాల్లో నటించారు. తకిట తకిట, నా ఇష్టం, అవును, ప్రేమ ఇష్క్ కాదల్, అనామిక, మాయా, బ్రదర్ ఆఫ్ బొమ్మాళి, అవును-2, బెంగాల్ టైగర్‌తో పాటు పలు చిత్రాల్లో నటించారు.