శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 16 ఫిబ్రవరి 2022 (18:36 IST)

రాఘవ తల్లి గోగినేని కమలమ్మ కన్నుమూత

maharshi raghava
తెలుగు సినీ పరిశ్రమలో ఒక నటుడి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రాఘవ తల్లి గోగినేని కమలమ్మ బుధవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో కన్నుమూశారు. ఆమె వయసు 84 సంవత్సరాలు కాగా ఆమెకు ఇద్దరు కుమారులు. 
 
ఆమె పెద్ద కుమారుడు రాఘవ సినిమాలు, టీవీ సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు సుపరిచితమే. ఇక రెండో కుమారుడు వెంకట్ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. 
 
కమలమ్మ మృతి పట్ల పలువురు పలువురు సినీ, టీవీ రంగ ప్రముఖులు రాఘవకు తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కమలమ్మ అంత్యక్రియలు గురువారం నాడు జూబిలీహిల్స్ మహాప్రస్థానంలో జరగనున్నాయి.