శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 16 ఫిబ్రవరి 2022 (10:07 IST)

నటుడు ఎర్రకోట అల్లర్లలో నిందితుడు దీప్ సిద్ధూ మృతి

ప్రముఖ పంజాబీ నటుడు, సామాజిక ఉద్యమకారుడు, ఎర్రకోట అల్లర్లలో నిందితుడు దీప్ సిద్ధూ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. హర్యానాలోని సోనిపట్‌ దగ్గర ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి భటిండా వైపు వెళ్తుండగా రాత్రి 9.30గంటల ప్రాంతంలో సోనిపట్‌ దగ్గర సిద్ధూ కారు ఓ స్టేషనరీ ట్రక్‌ను ఢీకొట్టింది.
 
కేంద్రం తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఉద్యమంలో దీప్‌ సిద్ధూ పాల్గొన్నాడు. 2021లో రైతులు చేపట్టిన రిపబ్లిక్‌ డే పరేడ్‌ సందర్భంగా ఎర్రకోట దగ్గర చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలో కీలక నిందితుడిగా సిద్ధూ ఉన్న సంగతి తెలిసిందే.