గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 10 అక్టోబరు 2021 (18:25 IST)

'మా' కౌంటింగ్‌.. విష్ణు ప్యానెల్‌కే అనుకూలం.. నరేష్ జోస్యం

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల పోలింగ్‌ కౌంటింగ్‌ ప్రకియ కొనసాగుతుంది. ఈ ఎన్నికల్లో మంచు విష్ణు 80-100 ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తాడని నటుడు, మాజీ మా అధ్యక్షుడు నరేశ్‌ అన్నారు.

భారీ ఓటింగ్‌ విష్ణు ప్యానెల్‌కే అనుకూలం అని అన్నారు. ఈసారి ఎన్నికల్లో సైలెంట్‌ ఓటింగ్‌ జరిగిందని ఇతర రాష్ట్రాల నుంచి నుంచి వచ్చిన 30-40మంది ఓట్లు విష్ణు విజయంలో కీలక పాత్ర పోషిస్తాయి అని నరేశ్‌ పేర్కొన్నారు.
 
మా కౌంటింగ్ జరుగుతున్న నేపథ్యంలో ప్రకాష్ రాజ్, విష్ణుల్లో ఎవరు గెలుస్తారా అన్నదానిపై బెట్టింగ్‌లు పెడుతున్నారు. ఎప్పటికప్పుడు ఓటింగ్ శాతాన్ని బెట్టింగ్ రాయుళ్లు తెలుసుకుంటున్నారు. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ పరిసర ప్రాంతాల్లో బెట్టింగ్ జరుగుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఎవరు అధ్యక్ష పదవికి ఫేవరేట్ అంటూ రాజమండ్రి తదితర ప్రాంతాల నుంచి కూడా ఫోన్ కాల్స్ వస్తున్నట్లు సమాచారం. ఇక ఎక్కువ మంది మంచు విష్ణు గెలుస్తారంటూ ఫేవరేట్ గా పందెం కాస్తున్నట్లు తెలుస్తోంది. ఈ బెట్టింగ్ లో వేల నుంచి లక్షల్లో డబ్బులు పెడుతున్నట్టు సమాచారం.