ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 22 ఫిబ్రవరి 2017 (17:23 IST)

తల్లికి గుడి కడుతున్న హీరో ఎవరు?

రాఘవ లారెన్స్.. చిత్ర పరిశ్రమ నృత్యదర్శకుడు. హీరో కమ్ దర్శకుడు. నిర్మాత కూడా. ఈయన కేవలం సినీ నటుడిగానే కాకుండా సామాజిక సేవ, ఆధ్యాత్మిక కోణాలు కూడా ఉన్నాయి. త‌మిళ‌నాడులో కొన్నేళ్ల క్రితం ఆయ‌న చెన్నై నగ

రాఘవ లారెన్స్.. చిత్ర పరిశ్రమ నృత్యదర్శకుడు. హీరో కమ్ దర్శకుడు. నిర్మాత కూడా. ఈయన కేవలం సినీ నటుడిగానే కాకుండా సామాజిక సేవ, ఆధ్యాత్మిక కోణాలు కూడా ఉన్నాయి. త‌మిళ‌నాడులో కొన్నేళ్ల క్రితం ఆయ‌న చెన్నై నగర శివారు ప్రాంతాల్లో రాఘవేంద్రస్వామి ఆలయాన్ని సొంతగా నిర్మించి.. దీన్ని సినీ నటుడు రజినీకాంత్‌ చేతుల మీదుగా ప్రారంభించారు.
 
ఇపుడు ఈ ఆలయ ప్రాంగణంలోనే లారెన్స్‌.. తన తల్లి కన్మణికి గుడి కట్టిస్తున్నారు. ఆలయంలో ప్రతిష్టించ‌డానికి అయిదు అడుగుల పాలరాతి విగ్రహాన్ని కూడా సిద్ధం చేశారు. ఈ విగ్రహాన్ని రాజస్థాన్‌ రాష్ట్రంలో ప్రత్యేకంగా తయారు చేయించారు. 
 
వచ్చే నెలలో తమిళ ఉగాది సందర్భంగా తమ తల్లి విగ్రహాన్ని రాఘవ లారెన్స్ ఆవిష్కరించనున్నారు. 13 అడుగుల గాయత్రీ దేవి విగ్రహాన్ని ప్రతిష్టించి, ఆ కిందనే త‌న‌ తల్లి విగ్రహాన్ని పెడుతున్న‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు.