ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 7 అక్టోబరు 2024 (09:58 IST)

పవన్ గారూ.. గుడిలో ప్రసాదంతో పాటు మొక్కలు కూడా ఇవ్వండి : షాయాజీ షిండే

pawan - shinde
ఏపీ ఉప ముఖ్యమంత్రి, సినీ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు సినీ నటుడు షాయాజీ షిండే ఓ విజ్ఞప్తి చేశారు. గుడికి వచ్చే భక్తులకు ప్రసాదంతో పాటు ఒక మొక్కను కూడా ఇవ్వాలని కోరారు. తనకు పవన్ అపాయింట్మెంట్ ఇస్తే ఆయనను కలిసి పూర్తి వివరాలు తెలియజేస్తానని తెలిపారు. 
 
సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన చిత్రం "మా నాన్న సూపర్ హీరో". ఈ నెల 11వ తేదీన విడుదలకానుంది. ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా బిగ్ బాస్ సీజన్-8లో ఈ చిత్ర బృందం పాల్గొంది. ఇందులో షాయాజీ షిండే గురించి మాట్లాడుతూ, ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడ మొక్క నాటుతారని చెప్పారు. ఈ వ్యాఖ్యలు హీరో అక్కినేని నాగార్జున ఆశ్చర్యపోయి కారణాన్ని అడిగి తెలుసుకున్నారు. 
 
చనిపోయి మా అమ్మ జ్ఞాపకార్థం మొక్కలు నాటుతున్నట్టు చెప్పారు. ఒక మొక్కను నాటితి అది పెరిగి పెద్దదై ఏడు తరాలకు నీడను ఇస్తుందన్నారు. పైగా, ఈ మొక్కను చూసినపుడల్లా మా అమ్మ గుర్తుకు వస్తుందని వెల్లడించారు. మా అమ్మ తర్వాత తనకు భూమాత కూడా అంతే గుర్తొస్తుందని తెలిపారు. 
 
సాధారణంగా ఆలయాలకు వెళ్లిన వాళ్లకు ప్రసాదాలు పంచి పెడతారు. ప్రసాదంతో పాటు ఒక మొక్కను కూడా ఇస్తే బాగుటుంది. దాన్ని భక్తులు తీసుకెళ్లి నాటితో అందులో భగవంతుడిని చూసుకోవచ్చు. మహారాష్ట్రలో మూడు ఆలయాల్లో ఈ విధానాన్ని తాను ప్రారంభించినట్టు చెప్పారు. అయితే, అందరికీ అలా మొక్కలు ఇవ్వరని, ఎవరైతే అభిషేకం చేస్తారో వారిలో 100 లేదా 200 మందికి మాత్రమే ప్రసాదంలా వీటిని ఇస్తారన్నారు. 
 
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ అపాయింట్మెంట్ ఇస్తే ఆయనను కలిసి ఈ వివరాలన్నీ చెబుతానని తెలిపారు. దేవుడి ప్రసాదంలాగా మొక్కలను అందరికీ పంచాలి. అవి నాటితే పెరిగి చెట్లు అవుతారు. తర్వాత ఏడు జన్మలకు అవి పెరుగుతూనే ఉంటాయి అని షాయాజీ షిండే చెప్పారు. దీంతో నాగార్జున, సుధీర్ బాబులు కూడా ఆయనతో ఏకీభవించి, పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళతానని చెప్పారు.