సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 30 అక్టోబరు 2018 (14:56 IST)

తప్పు చేశాను... క్షమించండి... హీరో సూర్య తండ్రి శివకుమార్

తాను చేసిన చర్యను అనేకమంది ఖండిస్తున్నారనీ, అందువల్ల క్షమాపణలు కోరుతున్నట్టు తమిళ హీరో సూర్య తండ్రి, సీనియర్ నటుడు శివకుమార్ అన్నారు. 
 
తాజాగా మదురైలో జరిగిన ఓ షాపు ఓపెనింగ్‌కు వెళ్లిన శివకుమార్... తనతో సెల్ఫీ తీసుకునేందుకు ఓ అభిమాని ప్రయత్నించాడు. అతన్ని చూసిన శివకుమార్‌కు చిర్రెత్తుకొచ్చింది. దీంతో సెల్పీ తీస్తున్న అభిమాని చేయిపై కొట్టడంతో మొబైల్ ఫోన్ కాస్త కిందపడిపోయింది. తాజాగా శివకుమార్ చేసిన ఓ పనికి అభిమానులందరూ షాక్ అయ్యారు. 
 
దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో శివకుమార్ మీడియా ముందుకు వచ్చారు. తన చర్యను అనేక మంది సమర్థించడం లేదు. అందువల్ల తన చర్య పట్ల క్షమాపణలు కోరుతున్నట్టు చెప్పుకొచ్చారు.