శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 29 అక్టోబరు 2018 (14:26 IST)

సెల్ఫీలు ఎక్కువగా తీసుకునేవారు ఏమైపోతారో తెలుసా?

ఈ కాలంలో సెల్ఫీ పిచ్చి ఎక్కువైపోయింది. ఎక్కడపడితే అక్కడ సెల్ఫీలు తీసుకుంటున్నారు. కొందరైతే సెల్ఫీ తీసుకుంటూ చనిపోతున్నారు. అయినా కూడా ఈ సెల్ఫీలు తీసుకోవడం మానేయనంటూన్నారు. సెల్ఫీలు తీసుకోవచ్చు కానీ, అదేపనిగా తీసుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. సెల్ఫీ ఎక్కువగా తీసుకునేవారిలో ఏర్పడే అనారోగ్య సమస్యలు తెలుసుకుందాం..
 
సెల్ఫీ కరెక్ట్‌గా రావాలని శరీరాన్ని, మోచేతులను అటూఇటూ వంచేస్తుంటారు. అలా సెల్ఫీలు తీసుకుంటే సెల్పీ ఎల్బో వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సెల్ఫీ తీసుకునేటప్పుడు మోచేతిపై ఒత్తిడి పడుతుంది. ఈ ఒత్తిడి కారణంగా అదొక అనారోగ్య సమస్యగా మారుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.  
 
సెల్ఫీ స్టిక్స్‌తో సెల్ఫీలు తీసుకునే వారికి కూడా ఈ ముప్పు వచ్చే ప్రమాదం ఉంది. టెన్నిస్‌, గోల్ఫ్ ఆడేవారికి ఎలాగైతే మోచేతి స‌మ‌స్య‌లు వ‌స్తాయో.. సెల్ఫీలు తీసుకోవడం వలన కూడా అలాంటి సమస్యలే వస్తాయని చెప్పున్నారు. సెల్ఫీలు మ‌రీ ఎక్కువ‌గా తీసుకుంటున్న‌పుడు కండ‌రాల మీద ఒత్తిడి ప‌డి మోచేతి ప్రాంత‌మంతా వాపుగా మారిపోతుంది. అందువలన సెల్ఫీలకు దూరంగా ఉండడం మంచిదని వారు సూచిస్తున్నారు.