1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Actor Vishal told to deposit Rs 15 crore in loan dispute against Lyca Productions

హీరో విశాల్‌కు షాకిచ్చిన మద్రాస్ హైకోర్టు

Actor Vishal
తమిళ హీరో విశాల్‌కు మద్రాస్ హైకోర్టు తేరుకోలేని షాకిచ్చింది. లైకా సంస్థ నుంచి తీసుకున్న రుణానికి సంబంధించిన కేసులో రూ.15 కోట్లను ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ఈ మొత్తాన్ని మూడు వారాల్లోగా హైకోర్టు ప్రధాన రిజిస్ట్రార్ పేరుతో సొమ్ము చేయాలని పేర్కొంది. 
 
ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ వద్ద హీరో విశాల్ రూ.21.29 కోట్ల రుణాన్ని తీసుకున్నారు. ఈ మొత్తాన్ని "వీరమే వాగే సూడుం" చిత్ర నిర్మాణం కోసం తీసుకున్నారు. అయితే, ఈ చిత్రం నిర్మాణం పూర్తి చేసి, విడుదల కూడా అయింది. కానీ రుణాన్ని మాత్రం ఇంతవరకు చెల్లించలేదు. పైగా, ఓటీటీ, శాటిలైట్ హక్కులను చెల్లించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 
 
దీంతో లైకా నిర్మాణ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ఇరు వర్గాల వాదనలు ఆలకించిన తర్వాత రూ.15 కోట్లను ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలంటూ హీరో విశాల్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 22వ తేదీకి వాయిదావేసింది. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
తిరుమలలో 'ఆర్ఎక్స్-100' బ్యూటీ సందడి.. సెల్ఫీల కోసం