ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్

ఆ బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త.. నేటి నుంచి కొత్త నిబంధనలు

దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కెనరా బ్యాంకు ఒకటి. ఈ బ్యాంకు తాజాగా ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల బ్యాంకులో డిపాజిట్ చేసుకునే వారికి అంటే ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసే వారికి ఇకపై అధిక రాబడి పొందవచ్చు. ఇప్చటికే భారత స్టేట్ బ్యాంకుతో పాటు పలు బ్యాంకులు ఎఫ్.డిలపై వడ్డీ రేట్లను పెంచిన విషయం తెల్సిందే. ఇపుడు కెనరా బ్యాంకు కూడా ఈ తరహా నిర్ణయం తీసుకుంది. 
 
ఈ పెంచిన వడ్డీ రేట్లు మార్చి ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. ఎఫ్.డిలపై వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేరకు పెంచింది. దీంతో యేడాది కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై వడ్డీ రేటు 5.1 శాతానికి పెరిగింది. యేడాది నుంచి రెండేళ్ళ కాలపరిమితిలోని ఎఫ్.డి.లపై వడ్డీ రేటును 5.15 శాతానికి ఎగబాకింది. 
 
అలాగే, 3 నుంచి 5 యేళ్ళ కాలపరిమితి ఉన్న ఎఫ్.డిలపై వడ్డీ రేటును 5.45 శాతానికి పెంచింది. 5 నుంచి 10 యేళ్ళ కాలపరిమితి కలిగిన ఎఫ్.డిలపై వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచడంతో ఇది 5.5 శాతానికి చేరింది. సీనియర్ సిటిజన్లకు మాత్రం 50 బేసిస్ పాయింట్లతో అధిక వడ్డీ రేటును పొందవచ్చు.