సోమవారం, 10 మార్చి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 10 మార్చి 2025 (07:38 IST)

విశాల్‌తో కాదండోయ్.. నాకు నా బాయ్‌ఫ్రెండ్‌తో నిశ్చితార్థం అయిపోయింది.. అభినయ

Abhinaya
సినీనటుడు, అగ్రహీరో విశాల్‌తో ప్రేమలో వున్నట్లు రూమర్స్ ఎదుర్కొన్న అభినయ దక్షిణాది సినిమాల్లో మంచి పేరు కొట్టేసిన నటీమణుల్లో ఒకరు. ఆమె శంభో శివ శంభో, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాలతో బాగా ఫేమస్ అయ్యింది. కోలీవుడ్ నటుడు విశాల్‌తో ఆమె ప్రేమలో వున్నట్లు వార్తలొచ్చాయి. 
 
అయితే ఇవన్నీ అబద్ధమని..తనకు వేరొక బాయ్ ఫ్రెండ్ వున్నాడని ఆమె క్లారిటీ ఇచ్చేసింది. ఇంకా తనకు నిశ్చితార్థం జరిగిందని సోషల్ మీడియా ద్వారా ఆమె ధ్రువీకరించింది. 
 
అయితే, అభినయ తనకు ఎవరితో నిశ్చితార్థం అయిందో వివరాలను వెల్లడించలేదు. అయితే, ఆమె తన చేతి మీద నిశ్చితార్థపు ఉంగరం ఉన్నట్లు చూపించే ఒక చిత్రాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. చిత్రంలో ఆమె కాబోయే చేతిని కూడా మనం చూడవచ్చు. డఫ్ అండ్ డమ్ అయిన అభినయ నటనలో రాణించింది. 
Actress Abhinaya Engaged
Actress Abhinaya Engaged

తమిళంలో నాడోడిగల్ అనే సినిమాతో నటనా రంగ ప్రవేశం చేసింది. మునుపటి ఇంటర్వ్యూలలో, ఆమె తన చిన్ననాటి స్నేహితుడితో ప్రేమలో వున్నట్లు ధృవీకరించింది. వరుడి గురించి మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి.