కొద్దిగా నవ్వండి లేదా పెద్దగా నవ్వండి.. ఎవరు జడ్జి చేస్తారు... అమలాపాల్
టాలీవుడ్ హీరోయిన్లలో అమలా పాల్ ఒకరు. తెలుగు, మలయాళం, తమిళ, కన్నడ చిత్ర సీమల్లో నటించి, ప్రేక్షకులను ఆలరించింది. అయితే, ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో ఎప్పుడూ ఏదో ఒక న్యూస్‌తో అందరి నోళ్లలో అమలాపాల్ పేరు వినిపించింది.
కొంతకాలంగా సినిమాలపై తన ఫోకస్ మొత్తం పెట్టిన ఈమె.. తాజాగా ఈ భామ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోలు ఫాలోవర్లను జోష్ నింపుతున్నాయి. గ్రీన్ టాప్ అండ్ టోర్న్ జీన్స్‌లో ఎగిరిగంతేస్తూ కెమెరాకు ఫోజులిచ్చింది.
పొట్టి డ్రెస్‌లో ఉన్న అమలాపాల్ ఎనర్జిటిక్‌గా కనిపిస్తూ.. వైబ్రాంట్ లుక్‌లో సంతోషంగా హ్యాపీ మూడ్‌లో ఉన్న స్టిల్ ఒకటి ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది.
అంతేకాదండోయ్.. "కొద్దిగా నవ్వండి లేదా పెద్దగా నవ్వండి.. ఎవరు జడ్జి చేస్తారు" అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలను షేర్ చేసింది. మరి ఈ అమ్మడి ఇంత ఆనందంలో మునిగి తేలడానికి కారణమేంటో అని గుసగుసలాడుకుంటున్నారు సినీ జనాలు.