మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 30 ఏప్రియల్ 2018 (16:04 IST)

అతను మంచి ట్రైనర్.. రేయింబవుళ్లు శ్రమించి స్లిమ్‌గా తయారుచేశారు : అంజలి

అచ్చ తెలుగు ఆడపిల్ల అంజలి. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో అంజలి నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోవాల్సిందే. ఆ చిత్రం తర్వాత అంజలికి చెప్పుకోదగిన బ్రేక్ రాలేదని చెప్పాలి. అదేసమయంలో ఆమె ప్రధాన

అచ్చ తెలుగు ఆడపిల్ల అంజలి. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో అంజలి నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోవాల్సిందే. ఆ చిత్రం తర్వాత అంజలికి చెప్పుకోదగిన బ్రేక్ రాలేదని చెప్పాలి. అదేసమయంలో ఆమె ప్రధాన పాత్రలో నటించిన ఒకటి రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. దీనికితోడు అవకాశాలు కూడా సన్నగిల్లిపోయాయి.
 
ఈ క్రమంలో అంజలి కాస్త బొద్దుగా మారిపోయింది. అయితే, ఇపుడు మరింత స్లిమ్‌గా తయారైంది. ఇదే అంశంపై అంజలి ఓ మీడియాతో మాట్లాడుతూ, సినిమాల కోసం తాను సన్నబడలేదని చెప్పుకొచ్చింది. ఈ మధ్య కాలంతో కాస్త బొద్దుగా మారానని... తన ఫిజిక్ తనకే ఇబ్బందిగా అనిపించిందని... అందుకే ప్రత్యేకంగా ఓ ట్రైనర్‌ను పెట్టుకుని రేయింబవుళ్లు శ్రమించి సన్నబడినట్టు తెలిపింది. 
 
ఇకపోతే, గతంలో శరీరాకృతిపై పెద్దగా ఫోకస్ పెట్టలేదని... దాంతో, వయసుకు మించి పెద్దదానిలా కనిపించానని చెప్పింది. అలా బొద్దుగా కనిపించడం తన కెరీర్‌కు కూడా మైనస్ అయిందని... సీనియర్ హీరోలతోనే సినిమాలు వచ్చేవని తెలిపింది. ఇప్పుడు సన్నబడ్డాక... జూనియర్లతో కూడా సినిమా అవకాశాలు వస్తున్నాయని చెప్పింది. 
 
అదేసమయంలో సినీ ఇండస్ట్రీలోకి ఎందుకు వచ్చామా అని బాధపడిన సందర్భాలు లేవని తెలిపింది. నటన అనేది భగవంతుని వరం. అది నాకు పుష్కలంగా ఉంది. మనలో టాలెంట్‌ ఉన్నప్పుడు బాధపడాల్సిన అవసరం రాదు. ఈ రంగంలో కొన్ని సమస్యలు ఎదురయ్యాయని అంతకుమించి తాను పెద్దగా బాధపడిన సందర్భాలు లేవని అంజలి చెప్పుకొచ్చింది.