శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 11 మే 2022 (09:53 IST)

గుడ్ మార్నింగ్ కూడా చెప్పరు.. రాజమౌళిపై జయవాణి

Jayavani
Jayavani
జక్కన్న రాజమౌళి గురించి సైడ్ యాక్టర్ జయవాణి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. విక్రమార్కుడు, సై, మర్యాదరామన్న, ఛత్రపతి, యమదొంగ సినిమాల్లో నటించిన ఆమె.. రాజమౌళి గురించి వెల్లడించింది. 
 
ఈ సినిమాల్లో తన పాత్ర కోసం ఫోన్ చేసి.. జయమ్మ ఎక్కడ ఉన్నావ్, లొకేషన్‌కు వచ్చేయమని చెప్తారని గుర్తు చేసుకున్నారు. రాజమౌళి మేనేజర్ ఫోన్ చేసి.. రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్‌కి రావాలని చెప్తారని ఆమె చెప్పుకొచ్చారు.
 
అక్కడికి ఎలా రావాలని అడిగితే.. ఏది ఉంటె దాంట్లో వచ్చేయమని చెప్పే వారని, తాను ఎక్కడ ఉన్నది అడగకుండా రమ్మని చెప్తారని జయమ్మ చెప్పుకొచ్చారు. 
 
పని విషయంలో జక్కన్న చాలా సీరియస్‌గా ఉంటారని జయమ్మ గుర్తు చేసుకున్నారు. ఎవరితో ఎక్కువగా మాట్లాడే మనిషి కాదని కానీ రామా రాజమౌళి మాత్రం అందరితో మాట్లాడతారని వివరించారు. కనీసం రాజమౌళి గుడ్ మార్నింగ్‌లు కూడా చెప్పి టైం వేస్ట్ చేసుకోరని ఆమె పేర్కొన్నారు.