సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 6 మే 2022 (19:38 IST)

ఆర్ఆర్ఆర్ నుంచి కొమరం భీముడో వీడియో సాంగ్

NTR
NTR
జక్కన్న రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి కొమరం భీముడో వీడియో సాంగ్ విడుదలైంది. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటించిన చిత్రం రౌద్రం రణం రుధిరం.
 
అలాగే అలియా భట్, ఒలివియా మోరిస్‌లు హీరోయిన్స్ గా నటించగా, శ్రియ శరణ్, అజయ్ దేవగణ్, సముద్ర ఖని, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఎంఎం కీరవాణి అందించిన సంగీతం అందించారు. 
 
ఇకపోతే.. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమురం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్‌లు నటించారు. 
 
ఇందులో కొమురం భీముడో పాటకి దేశ వ్యాప్తంగా మంచి క్రేజ్ వచ్చింది. ఈ పాటలో ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపించారు. ఈ ఒక్క పాటకోసం అభిమానులు థియేటర్ల కి క్యూ కట్టారు అని చెప్పొచ్చు.
 
ఈ కొమురం భీముడో ఫుల్ వీడియో సాంగ్ ను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. యూ ట్యూబ్‌లో అన్ని బాషల్లో పాటను విడుదల చేయగా, భారీ రెస్పాన్స్ వస్తోంది.