మంగళవారం, 21 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 20 ఏప్రియల్ 2022 (15:00 IST)

ఆర్ఆర్ఆర్ రికార్డ్.. తెలుగు సినిమా చరిత్రలో... అత్యధిక ప్రింట్లతో..?

rrrmovie
జక్కన్న లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్ సినిమా తెలుగు సినిమా చరిత్రలో ఇది వరకు ఊహించని రికార్డు నెలకొల్పింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏ తెలుగు సినిమా నమోదు చెయ్యని అనూహ్య వసూళ్ల లెక్కలను సెట్ చేసి చరిత్ర సృష్టించింది. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కినా.. తెలుగులోనే అత్యధిక ప్రింట్స్‌లతో రిలీజైంది.  
 
ఇలా రిలీజ్ అయ్యిన తెలుగు ప్రింట్స్‌తో ఈ సినిమా మరో చరిత్ర సృష్టించినట్టుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా లేటెస్ట్‌గా ఒక్క తెలుగు వెర్షన్‌లో మాత్రమే ఆరు వందల కోట్ల రూపాయల గ్రాస్‌ని కలెక్ట్ చేసి అదరగొట్టిందట. 
 
దీనితో ఈ భారీ మార్క్ అందుకున్న ఏకైక తెలుగు సినిమాగా ఈ సినిమా చరిత్ర సృష్టించింది. ఇలాంటి అరుదైన ఫీట్‌లు సింగిల్ భాషలో హిందీలో ఎక్కువ కనిపిస్తాయి కానీ మొదటి ఒక తెలుగు సినిమాకి జరగడం విశేషం అని చెప్పాలి.