మంగళవారం, 21 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 21 ఫిబ్రవరి 2022 (15:26 IST)

కాజల్ అగర్వాల్ సీమంతం ఫోటోలు..

kajal
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ సీమంతం ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. త‌న భ‌ర్త‌ గౌతమ్ కిచ్లుతో పాటు కుటుంబస‌భ్యులు, బంధువుల‌తో ఆమె ఈ సంద‌ర్భంగా దిగిన ఫొటోలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి. త్వరలోనే కాజ‌ల్ తొలి బిడ్డకు జ‌న్మ‌నివ్వ‌నుంది. 
 
తాజాగా సీమంతం ఫోటోల్లో కాజల్ అగర్వాల్ ఎరుపు, బంగారు రంగు శారీలో కనిపించింది. ఆమె హబ్బీ గౌతమ్ కిచ్లు సాంప్రదాయ దుస్తులు, క్రిస్ప్ వైట్ కుర్తా-పైజామా, ఎరుపు జాకెట్‌లో ఆమెతో జంటగా నటించారు. 
 
ఇటీవల, గర్భధారణ సమయంలో మహిళలు తమ శరీర మార్పులను ఎలా స్వీకరించాలనే దానిపై కాజల్ సుదీర్ఘ నోట్ కూడా రాసింది. 'నేను నా జీవితంలో, నా శరీరంలో, నా ఇంటిలో, ముఖ్యంగా నా పని ప్రాంతంలో అత్యంత అద్భుతమైన కొత్త పరిణామాలతో వ్యవహరిస్తున్నాను. గర్భధారణ సమయంలో, మన శరీరాలు బరువు పెరగడంతో సహా అనేక మార్పులను ఎదుర్కొంటాయి!! 
 
జీవితంలో అత్యంత అందమైన, అద్భుత, విలువైన దశలో వున్నానని తెలిపింది. కాజల్ అగర్వాల్- గౌతమ్ కిచ్లు అక్టోబర్ 30, 2020న వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
 
కాజ‌ల్ అగ‌ర్వాల్ సినిమాల పరంగా చూస్తే ఆచార్య సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. హే సినామిక సినిమాలోనూ దుల్కర్ సల్మాన్ సరసన కాజ‌ల్ న‌టించింది. ఈ సినిమా వ‌చ్చేనెల 3న విడుద‌ల కానుంది.