గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 19 జనవరి 2023 (14:43 IST)

టీచరమ్మగా మారిన నిత్యామీనన్.. ఇంగ్లీషు పాఠాలు ఎలా చెప్పిందంటే? (video)

nithya menon
ప్రముఖ దక్షిణ భారత నటి నిత్యా మీనన్ తన షూటింగ్ షెడ్యూల్‌లో విరామం సమయంలో ఉపాధ్యాయురాలిగా కొత్త పాత్రను పోషించింది. కృష్ణాపురం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించి విద్యార్థులకు పాఠాలు బోధించింది. 
 
విద్యార్థులకు నైతిక కథలు బోధిస్తున్న వీడియోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. క్యాప్షన్‌లో, మీనన్ ఇలా రాసింది "ఇది నా కొత్త సంవత్సర దినం. కృష్ణాపురం గ్రామంలోని పాఠశాలలో అందమైన చిన్నారులతో గడిపాను. గ్రామాలలో పిల్లలు చాలా సంతోషంగా వున్నారు" అంటూ చెప్పుకొచ్చింది.
 
విద్యార్థులకు అర్థమయ్యేలా తెలుగులో వివరిస్తూ పాఠం చెబుతున్న వీడియోను ఆమె తన ఇన్ స్టా అకౌంట్ లో పోస్ట్ చేశారు. చక్కటి తెలుగులో మాట్లాడుతూ, ఇంగ్లిష్ పాఠాన్ని చదివి వినిపిస్తూ, తెలుగులో అర్థం చెబుతూ పాఠశాలలో సందడి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.