సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 12 జూన్ 2023 (14:54 IST)

క్యాస్టింగ్ కౌచ్: సడెన్‌గా అలా మిస్ బిహేవ్ చేసేసరికి.. ప్రగతి

Pragathi
క్యారెక్టర్ ఆర్టిస్ట్, సీనియర్ నటి ప్రగతి క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ప్రగతితో ఓ స్టార్ కమెడియన్ అసభ్యంగా ప్రవర్తించాడని షాకింగ్ కామెంట్స్ చేసింది. సెట్‌లో వున్నప్పుడు సదరు కమెడియన్ పద్ధతిగా వుంటారు. 
 
కానీ ఎందుకో ఓ రోజు సడెన్‌గా అతని ప్రవర్తనలో తేడా వచ్చింది. సెట్‌లో సడెన్‌గా అలా మిస్ బిహేవ్ చేసేసరికి.. ఏంటీ ఆయన ఇలా చేశారు అనిపించింది. దాన్ని జీర్ణించుకోవడం తన వల్ల కాలేదని ప్రగతి వెల్లడించింది. అలా జరిగేసరికి ఫుడ్ తినాలని అనిపించలేదు. ఆయనకు వర్క్ అయిపోవడంతో ఆయనతో డైరక్టుగా మాట్లాడానని చెప్పుకొచ్చింది. 
 
"నేను మీతో ఎప్పుడైన మిస్ బిహేవ్ చేశానా. అంటే నా సైడ్ నుంచి మీకు రాంగ్ సిగ్నల్ కానీ, నా బాడీ లాంగ్వెజ్ కానీ, నా కళ్లు కానీ నాకే తెలియకుండా నేను ఒప్పుకుంటున్నట్లుగా ఏమైనా ఆహ్వానించానా" అంటూ అడిగేసరికి అలాంటిది ఏమీ లేదని సదరు కమెడియన్ అన్నట్లు ప్రగతి వెల్లడించింది.