గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 10 జూన్ 2023 (11:36 IST)

తూతూ నాయక్‌పై ప్రకృతి మిశ్రా క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు

Prakruti Mishra
Prakruti Mishra
సినీ నిర్మాత తూతూ నాయక్‌పై ఒడియా సినీ నటి ప్రకృతి మిశ్రా కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసింది. ఓ టీవీకి ప్రకృతి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, రాత్రిపూట సినిమా సెట్‌లో షూటింగ్ పూర్తయిన తర్వాత, నాయక్ నటీమణులను ఆహ్వానించేవాడు. అమ్మాయి తిరస్కరిస్తే, అతను ఆమెను సినిమా నుండి తొలగిస్తాడు.
 
ఇంకా నటీమణుల ప్రతిష్టను దిగజార్చాడని ప్రకృతి చెప్పింది. అతను కొత్త నటీమణులను కూడా వేధింపులకు గురిచేస్తున్నాడని ప్రకృతి ఆరోపించింది. చిత్ర పరిశ్రమ నుంచి తూతూ నాయక్‌ను వెలివేయాలని ప్ర‌కృతి కోరింది. 
 
దీనిపై తూతూ నాయక్ స్పందిస్తూ.. ఒడిశా ప్రజలకు తానెవరో తెలుసన్నారు. ఇంకా ప్రకృతి ఆరోపణల్లో అర్థం లేదు. అవసరమైతే కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు.