రాశి.. కొత్త లుక్.. స్లిమ్‌గా మారింది.. పోలీస్ ఆఫీసర్‌గా అదుర్స్
ఐ యామ్ బ్యాక్ అంటూ కొత్త లుక్‌లో రాశి వచ్చేసింది. టాలీవుడ్‌లో ఒకప్పుడు తన నటన, అందంతో ప్రేక్షకులను మైమరిపించిన హీరోయిన్ రాశీ రీ ఎంట్రీ ఇస్తోంది. చాలా కాలం పాటు సినిమాలకు గ్యాప్ తీసుకున్న ఆమె ఇటీవలే ఓ యూట్యూబ్ చానెల్ ప్రారంభించి అందులో వంట వీడియోలు పోస్టు చేస్తూ వచ్చింది.
ప్రస్తుతం సినిమాల్లో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఇందులో భాగంగా మంచి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటోంది. ప్రస్తుతం రాశికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
పోలీస్ అధికారిణి లుక్‌లో ఆమె కనిపించడంతో కొత్త సినిమా కోసమేననే ప్రచారం జరుగుతోంది. అప్పట్లో చాలా బొద్దుగా కనిపించిన రాశి ఇప్పుడు స్లిమ్‌గా మారిపోయి పోలీస్ గెటప్‌లో కనిపించింది. కాగా అంతకుముందు ఎన్నో సినిమాల్లో హీరోయిన్‌గా చేసిన ఆమె, నిజం సినిమాలో బోల్డ్ పాత్రతో పాటు, స్పెషల్ సాంగ్స్‌లోనూ నటించారు.
చివరగా 2017లో లంక అనే ఓ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. తాజాగా రాశి క్యారెక్టర్ రోల్స్ చేసేందుకు ఆసక్తి చూపుతోంది. ప్రస్తుతం పోలీస్ ఆఫీసర్ లుక్‌లో విడుదలైన ఫోటోలు ఏ సినిమాకు సంబంధించినవని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.