శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 25 జులై 2018 (11:14 IST)

పెళ్లిపీటలెక్కనున్న మిల్కీబ్యూటీ...

తెలుగు చిత్రపరిశ్రమలో మిల్కీబ్యూటీగా గుర్తింపు పొందిన హీరోయిన్ తమన్నా. ఈ అమ్మడుకి "బాహుబలి" తర్వాత పెద్దగా ఆఫర్లు రావడం లేదు. ఒకకొరగా వస్తున్న ఆఫర్లతో విసిగిపోయిన తమన్నా.. ఇపుడు ఓ ఇంటికి కోడలు కావాలని

తెలుగు చిత్రపరిశ్రమలో మిల్కీబ్యూటీగా గుర్తింపు పొందిన హీరోయిన్ తమన్నా. ఈ అమ్మడుకి "బాహుబలి" తర్వాత పెద్దగా ఆఫర్లు రావడం లేదు. ఒకకొరగా వస్తున్న ఆఫర్లతో విసిగిపోయిన తమన్నా.. ఇపుడు ఓ ఇంటికి కోడలు కావాలని భావిస్తోంది.
 
నిజానికి సినీ రంగంలో టాప్ హీరోయిన్లుగా రాణించిన సోన‌మ్ క‌పూర్‌, శ్రియ‌, అనుష్క శ‌ర్మ వంటి పలువురు హీరోయిన్లు మూడు ముళ్ళ బంధంతో ఒక్కంటివారైన విషయం తెల్సిందే. తాజాగా ఇపుడు మిల్కీ బ్యూటీ కూడా ఈ కోవలో చేరనున్నారు. 
 
వాస్తవానికి తమన్నాకు ఆమె కుటుంబ సభ్యులు ఎప్పటి నుంచో సంబంధాలు చూస్తున్నారు. ఇందులోభాగంగా, అమెరికాకి చెందిన డాక్ట‌ర్‌ని ఓకే చేశార‌ట. పెళ్లికొడుకు ఫ్యామిలీ అమెరికాలో బాగా సిర్థపడిన కుటుంబమని సమాచారం. 
 
త్వ‌ర‌లోనే వీరిద్దరికి నిశ్చితార్ధం జరిపి, ఆ త‌ర్వాత పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేయాల‌ని కుటుంబ స‌భ్యులు భావిస్తున్నార‌ట‌. అతి త్వ‌ర‌లోనే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రానుంద‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం త‌మ‌న్నా "క్వీన్" రీమేక్ తెలుగు వ‌ర్షెన్‌లో ప్ర‌ధాన పాత్ర పోషిస్తుంది. పెళ్లి త‌ర్వాత అమెరికాలోనే త‌మ‌న్నా స్థిరపడనుంది.