శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 6 డిశెంబరు 2018 (17:54 IST)

అభ్యర్థి నచ్చకపోతే నోటా ఆప్షన్ ఉంది.. యామినీ భాస్కర్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు శుక్రవారం జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో చాలా మంది యువతతో పాటు సెలెబ్రిటీలు ఓటు హక్కును వినియోగించుకుంటున్నాయి. అలాంటివారిలో తెలుగు హీరోయిన్ యామినీ భాస్కర్ ఒకరు. 
 
దీనిపై ఆమె స్పందిస్తూ, ఎన్నికల రోజున సెలవు రోజున భావించి ఎంజాయ్ చేయకుండా నేరుగా పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేయాలని కోరారు. పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ఏ ఒక్కరూ నచ్చకపోతే నోటా ఆప్షన్ ఉందని, అందువల్ల దాన్ని వాడుకోవచ్చని అభిప్రాయపడ్డారు. 
 
ఓటు వేయడం కేవలం బాధ్యత మాత్రమేకాదు మన భవిష్యత్‌ను నిర్ణయించేది అని చెప్పారు. అందువల్ల ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. అదేసమయంలో ఈ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారనేదానిపట్ల ఆసక్తిగా ఉందని చెప్పుకొచ్చింది.