శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018
Written By
Last Modified: గురువారం, 6 డిశెంబరు 2018 (17:38 IST)

పల్లెబాట పట్టిన ఓటరు... ఎలాగైనా ఓటేసి తీరుతాం... ఎవరికో?

రేపే ఎన్నికలు కావడంతో నగరంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న గ్రామీణ ప్రాంతాల ఓటర్లు పల్లె బాట పట్టారు. కొత్తగూడెం, నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు చెందిన వారు గ్రామాల బాట పట్టారు. వారివారి స్వంత గ్రామానికి వెళ్లేందుకు ఎల్ బి నగర్‌కు చేరుకోవడంతో విజయవాడ బస్టాప్ వద్ద రద్దీ వాతావరణం నెలకొంది.
 
కామన్‌గా దసరా, దీపావళి, సంక్రాంతి పండగల సమయంలో రద్దీగా ఉండే ఈ ఏరియా ప్రయాణికులతో కిక్కిరిసి పోయింది. ఈ సమయంలో బస్సులు సరిగా అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందిపడుతూ తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎలాగైనా చేరుకోవాలని పడిగాపులు కాస్తున్నారు. ఎలాగైనా ఈ ఎన్నికల్లో ఓట్లు వేసి తీరుతాం అంటున్నారు. మరి వీళ్లంతా ఏ పార్టీకి వెయ్యబోతున్నారో...?