గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 20 సెప్టెంబరు 2017 (15:46 IST)

రియాల్టీ డ్యాన్స్ షో: జడ్జీలుగా రేణు దేశాయ్‌తో పాటు ఆదాశర్మ కూడా..?

బిగ్ బాస్ రియాల్టీ షో త్వరలో పూర్తి కానుంది. ఈ షో ద్వారా మా టీవీ క్రేజ్, రేటింగ్ అమాంతం పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రోగ్రామ్ స్థానంలో త్వరలో ఓ రియాల్టీ డ్యాన్స్ షోను ప్రసారం చేసేందుకు స్ట

బిగ్ బాస్ రియాల్టీ షో త్వరలో పూర్తి కానుంది. ఈ షో ద్వారా మా టీవీ క్రేజ్, రేటింగ్ అమాంతం పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రోగ్రామ్ స్థానంలో త్వరలో ఓ రియాల్టీ డ్యాన్స్ షోను ప్రసారం చేసేందుకు స్టార్ మా ఏర్పాట్లు చేస్తోంది. స్టార్ ప్లస్‌లో వస్తోన్న నాచ్ బలియో తరహాలో డ్యాన్స్ షో వుంటుందని టాక్ వస్తోంది. ఈ కార్యక్రమానికి ముగ్గురు న్యాయ నిర్ణేతలుంటారని తెలిసింది. 
 
వీరిలో ఒక న్యాయ నిర్ణేతగా రేణు దేశాయ్, మరో ఇద్దరు న్యాయ నిర్ణేతలుగా ఆదాశర్మ, జానీ మాస్టర్లు వ్యవహరిస్తారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. ఆల్‌రెడీ కొన్నిరోజుల క్రితమే ఒక న్యాయ నిర్ణేతగా రేణు దేశాయ్‌ను తీసుకున్నారు. మిగతా ఇద్దరు న్యాయ నిర్ణేతలుగా జానీ మాస్టర్‌ను ఆదా శర్మను తీసుకున్నారనేది తాజా సమాచారం. 
 
ఆదాశర్మ విషయానికి వస్తే ఆమె హీరోయిన్‌ అని మాత్రమే ఆమెను ఎంపిక చేయలేదట. కథక్ నృత్యంలోను, వెస్ట్రన్ డ్యాన్స్‌ల్లోనూ ఆమెకి మంచి నైపుణ్యం ఉందట. ఈ కారణంగానే ఆమెను తీసుకోవడం జరిగిందని చెప్తున్నారు. త్వరలో ఈ షోకు సంబంధించి ప్రోమో త్వరలో రిలీజ్ కానుంది.