బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శుక్రవారం, 24 డిశెంబరు 2021 (16:48 IST)

నిర్మాణానంత‌ర ప‌నుల్లో ఆది సాయికుమార్ తీస్ మార్ ఖాన్ చిత్రం

Adi Saikumar, Tees Mar Khan team
'ప్రేమ కావాలి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆది సాయి కుమార్ అంచెలంచెలుగా ఎదుగుతూ భారీ పాపులారిటీ దక్కించుకుంటున్నారు. మరికొద్ది రోజుల్లో 'తీస్ మార్ ఖాన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
 
ఈ నేపథ్యంలో 'తీస్ మార్ ఖాన్' నిర్మాత తమ విజ‌న్ సినిమాస్ ఆఫీసులో ఆది సాయి కుమార్ బర్త్ డే వేడుకను ఘనంగా నిర్వహించారు. పలువురు సన్నిహితుల మధ్య జరిగిన ఈ పార్టీలో ఆది సాయి కుమార్ చేత కేక్ కట్ చేయించి ఆయనకు ఆల్ ది బెస్ట్ చెప్పింది 'తీస్ మార్ ఖాన్' టీమ్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 'తీస్ మార్ ఖాన్' దర్శకనిర్మాతలు నాగం తిరుప‌తి రెడ్డి, కళ్యాణ్ జి గోగణ.. ఆది సాయి కుమార్‌కి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ యాక్షన్ ప్యాక్డ్ మూవీ 'తీస్ మార్ ఖాన్' ఘన విజయం సాధించాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతకు కృతజ్ఞతలు చెప్పిన ఆది సాయి కుమార్.. ముందు ముందు మరిన్ని వినూత్న కథలతో అలరిస్తానని అన్నారు.  
 
ఇక 'తీస్ మార్ ఖాన్' సినిమా విషయానికొస్తే.. విజ‌న్ సినిమాస్ బ్యాన‌ర్‌పై నాగం తిరుప‌తి రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు. 'నాటకం' ఫేమ్ కళ్యాణ్ జి గోగణ దర్శకత్వం వహిస్తున్నారు. RX 100 సినిమాతో యువతను ఆకట్టుకున్న పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటిస్తోంది. సునీల్ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఫస్ట్ గ్లాన్స్ ఆది సాయి కుమార్ బర్త్ డే కానుకగా రిలీజ్ చేయగా.. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన తెచ్చుకుంటోంది. 
 
రీసెంట్‌గా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఈ వీడియోలో ఆది సాయికుమార్ పవర్ ప్యాక్డ్ లుక్‌లో కనిపించి సినిమాపై హైప్ పెంచేశారు. సాయి కార్తీక్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్ సినిమాపై ఆసక్తిని పెంచేశాయి. అతి త్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.
 
కాస్ట్: ఆది సాయికుమార్, పాయల్ రాజ్‌పుత్, సునీల్ , అనూప్ సింగ్ ఠాకూర్, కబీర్ సింగ్, పూర్ణ