బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : గురువారం, 28 అక్టోబరు 2021 (20:26 IST)

ఆది సాయి కుమార్, పాయల్ రాజ్ పుత్ గోవాలో రొమాంటిక్ సాంగ్

Adi Sai Kumar, Payal Rajput
ఆది సాయి కుమార్ కథానాయకుడిగా నటిస్తోన్న తాజా చిత్రం "తీస్ మార్ ఖాన్‌. విజ‌న్ సినిమాస్ బ్యాన‌ర్‌పై నాగం తిరుప‌తి రెడ్డి ఈ చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. గ్లామరస్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కథానాయికగా నటిస్తుంది. హై యాక్షన్ వోల్టేజ్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా కి కళ్యాణ్ జి గోగణ దర్శకత్వం వహిస్తుండగా ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల అయ్యి మంచి ప్రేక్షకాదరణ అందుకుంది. అంచనాలకు తగ్గట్లుగా ఈ లుక్ ప్రేక్షకులను బాగా అలరించింది. హీరో ఆది సాయి కుమార్ పవర్ ప్యాక్డ్ లుక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. 
 
మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలు పోషిస్తున్న సాయి కుమార్ ఈ పోస్టర్ లో నెవర్ బిఫోర్ అనే రేంజ్ లో కనిపించి అందరినీ అలరించారు. పాయ‌ల్ రాజ్‌పుత్ పాత్ర ఇప్ప‌టి వ‌ర‌కు ఆమె చేసిన చిత్రాల‌కు భిన్నంగా, ఇది వ‌ర‌కు చూడ‌ని స‌రికొత్త క్యారెక్ట‌ర‌రైజేష‌న్‌తో అటు గ్లామ‌ర్ ప‌రంగా, ఇటు పెర్ఫామెన్స్ ప‌రంగా ఆక‌ట్టుకోనుంది. ప్ర‌స్తుతం ఈ సినిమా చిత్రీక‌ర‌ణ గోవాలో జరుగుతుంది. హీరో, హీరోయిన్స్‌పై మంచి రొమాంటిక్ సాంగ్‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఆది సాయికుమార్ డాన్స్‌, పాయల్ రాజ్ పుత్ గ్లామర్ ఈ పాటకు ప్రధాన ఆకర్షణ కాగా సినిమా మొత్తానికి ఈ పాట హైలైట్ గా నిలవనుంది. విజన్ సినిమాస్ పతాకంపై  ఈ సినిమా ను నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తుండగా  సాయి కార్తీక్ సంగీతం సమకూరుస్తున్నారు. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ, మణికాంత్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. త్వరలోనే ఈ సినిమా కి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి చేయనున్నారు.