శనివారం, 2 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 15 అక్టోబరు 2021 (16:14 IST)

ఆది 'తీస్ మార్ ఖాన్' ఫస్ట్ లుక్ రిలీజ్

తెలుగు చిత్రపరిశ్రమలో లవర్ బాయ్‌గా గుర్తింపు పొందిన ఆది సాయికుమార్ మరో చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి తీస్ మార్ ఖాన్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. 'నాటకం' వంటి విభిన్న కథాంశంతో కూడుకున్న చిత్రాన్ని తెరకెక్కించి ప్రేక్షకులను అలరించిన దర్శకుడు కళ్యాణ్ జి గోగణ దర్శకత్వంలో ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. 
 
ప్రొడక్షన్ నెంబర్ 3గా విజన్ సినిమాస్ బ్యానరుపై ప్రముఖ వ్యాపారవేత్త నాగం తిరుపతి రెడ్డి ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఆకర్షించే అందం, చక్కటి అభినయంతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసిన పాయల్ రాజ్‌పుత్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుండగా, కీలకమైన పాత్రలో ప్రముఖ నటుడు సునీల్ నటిస్తున్నాడు. దసరా పండగ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ మరియు ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది చిత్ర బృందం.
 
ఈ 'తీస్ మార్ ఖాన్' చిత్రంలో ఆది మరో పవర్ ఫుల్ పాత్రలో నటిస్తుండగా, హై ఓల్టేజ్ యాక్షన్ ఓల్టేజ్ ఎంటర్టైనర్‌గా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ ఫస్ట్ లుక్‌లో ఆది నెవర్ బిఫోర్ అనే రేంజ్‌లో కనిపిస్తున్నాడు. సిగరెట్ కాలుస్తూ నడుస్తూ వస్తున్నట్లు ఉన్న ఈ మాస్ లుక్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది. ఇక ఈ సినిమాలో స్టూడెంట్, రౌడీ, పోలీస్‌గా మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో ఆది నటిస్తుండటం విశేషం.