మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 15 సెప్టెంబరు 2021 (18:12 IST)

బాలయ్యతో క్రాక్ డైరక్టర్.. మూవీ టైటిల్‌పై తాజా అప్డేట్

అఖండ సినిమాతో బిజీగా ఉన్న బాలకృష్ణ క్రాక్‌ డైరెక్టర్‌ గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. క్రాక్‌ హిట్‌‌తో ఊపు మీదున్న గోపీచంద్‌ మలినేని బాలకృష్ణ లాంగ్వేజ్‌‌కు సరిపడే కథాంశంతో ఈ సినిమాను తీయనున్నారు. మైత్రీ మూవీస్‌ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది.
 
అయితే ఈ సినిమా టైటిల్‌ గురించి.. గత వారం రోజుల నుంచి సోషల్‌ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. బాలకృష్ణ మరియు గోపీచంద్‌ మూవీకి రౌడీయిజం అనే పేరు ఖరారు చేసినట్లు దీనిని త్వరలోనే ప్రకటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
 
దీనిపై మైత్రీ మూవీస్‌ సంస్థ స్పందించింది. ఈ మూవీకి రౌడీయిజం అనే పేరు ఖరారు కానున్నట్లు స్పష్టం చేసింది మైత్రీ మూవీస్‌ సంస్థ. ఈ మేరకు ఓ పోస్టర్‌ కూడా విడుదల చేసింది. రూమర్లను ఎవరూ నమ్మకండని… త్వరలోనే ఈ సినిమా టైటిల్‌‌ను ప్రకటిస్తామని కుండబద్దలు కొట్టింది.