శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 6 మార్చి 2019 (18:52 IST)

బాత్రూమ్‌లోకి ఈడ్చుకెళ్లి నా భర్త అలా చేశాడన్న నాగిని స్టార్.. భర్త ఏమన్నాడంటే?

''తమ్ముడు'' సినిమాలో నటించిన నటి అదితి గోవిత్రికర్ సోదరి అర్జూ గోవిత్రికర్ వార్తల్లో నిలిచింది. తన భర్త హింసిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం నాగిని వంటి హిట్ సీరియల్స్‌లో నటిస్తున్న అర్జూ తన సోదరి అదితి గోవిత్రికర్‌తో కలసి వెళ్లి పోలీస్ స్టేషన్‌లో తన భర్తపై గృహహింస కేసు నమోదు చేసింది. తన భర్త ఎనిమిదేళ్లుగా మద్యం తాగి హింసిస్తున్నాడని ఆ ఫిర్యాదులో ఆరోపించింది. 
 
ఐదేళ్ల నుంచి భర్తకు దూరంగా వర్లీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నట్లు తెలిపింది. కానీ సిద్దార్థ్ తరచుగా వస్తూ తన కుమారుడిని తీసుకెళ్ళిపోతున్నాడని, ఈ క్రమంలో శారీరక దాడికి పాల్పడుతున్నట్లు అర్జూ పేర్కొంది. ఓ సందర్భంలో తన భర్త తనపై దాడి చేసిన వీడియోని కూడా అర్జూ పోలీసులకు ఇచ్చింది. అయితే ఈ వీడియోలో బాత్రూమ్‌కి అర్జూను ఈడ్చుకెళ్లి కొట్టినట్లు వుంది. 
 
అయితే అర్జూ భర్త సిద్ధార్థ్ మాత్రం ఈ వీడియోలో నిజం లేదంటున్నాడు. ఆ రోజు టీవీ షో కోసం రిహార్సల్స్ చేస్తుందని.. అందులో భాగంగానే ఆమె కొట్టమంటేనే చెంపదెబ్బ కొట్టినట్లు సిద్ధార్త్ చెప్పాడు. దీంతో అర్జూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సెక్షన్ 498 ఏ, 323, 504 కింద కేసు నమోదు చేశారు. పూర్తి స్థాయిలో సిద్దార్థ్‌ని విచారించేందుకు రంగంలోకి దిగుతున్నారు.