మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By
Last Modified: సోమవారం, 25 ఫిబ్రవరి 2019 (20:02 IST)

తనతో శృంగారం చేయాలంటూ నాకు నరకం చూపిస్తుంది...

నమస్కారం... నా పేరు శ్రీకర్. నేను ఒక కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నాను. మాది జాయింట్ ఫ్యామిలీ. అయితే మా అన్నయ్యకి 3 సంవత్సరాల క్రితం పెళ్లి అయింది. ఒక సంవత్సరం నుంచి మా వదిన గారితో శారీరక సుఖాన్ని పొందుతున్నాను మా హౌస్‌లో. నాకు 4 నెలలు క్రితం పెళ్లి చేశారు. దీనికి మా వదిన ఒప్పుకున్నారు. పెళ్లయ్యాక ఆ సంబంధం వద్దు అని చెప్తున్నా మా వదిన వినటంలేదు.
 
ఎప్పుడు ఎలా ఉంటామో అలాగే ఉందాం అంటుంది. లేకపోతే నా భార్యకి తనతో వున్న అక్రమ సంబంధం విషయం చెప్పేస్తానని బ్లాక్‌మెయిల్ చేస్తుంది. తనతో శృంగారం చేయాలంటూ నాకు నరకం చూపిస్తుంది. నేను నా భార్యకు నిజం చెప్పితే తను నన్ను వదిలి వెళ్తే నేను తట్టుకోలేను. నా భార్యని నేను చాలా ప్రాణంగా ప్రేమిస్తున్నా. దయచేసి సలహా ఇవ్వండి.
 
వదిన అనే స్థానాన్ని మీ ఇద్దరూ అపహాస్యం చేసారు. కుటుంబ బంధానికి మచ్చ తెచ్చారు. ఆమె పూర్తిగా మీ ఆకర్షణలో పడిపోయినట్లుంది. శృంగార పరంగా ఎవరు ముందడుగు వేశారన్నది మీరు చెప్పలేదు. కొన్ని జాయింట్ ఫ్యామిలీల్లో ఇలాంటి చేదు ఘటనలు జరుగుతుండటాన్ని మనం చూస్తున్నాం. ఎవరూ లేని సమయంలో మహిళను లొంగదీసుకునేవారే అధికం. 
 
తొలినాళ్లలో ఉల్లాసంగా ఉత్సాహంగా శృంగారం చేసిన మీరు ఇప్పుడది నరకంలా కనబడటానికి కారణం ఏమిటో మీకే తెలుసు. చెప్పినా చెప్పకపోయినా మీ ఇద్దరి మధ్య వున్న బంధం ఎప్పటికైనా బయటపడుతుంది. కనుక దీనికి కాలమే సమాధానం చెప్తుంది. అంతవరకూ ఓర్పుతో వుండటం తప్పించి మీరు ప్రస్తుతానికి ఏమీ చేయలేరు.