కరణ్ జోహార్‌కు ఊహించని షాక్... 'యే దిల్ హై ముష్కిల్' చిత్రాన్ని ప్రదర్శించం...
బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్‌కు ఊహించని షాక్ తగిలింది. 'యే దిల్ హై ముష్కిల్' సినిమా రిలీజ్‌కు అడ్డంకులు తొలగిపోయాయని ఆనందంగా ఉన్న ఆయన.. ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు.
బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్‌కు ఊహించని షాక్ తగిలింది. 'యే దిల్ హై ముష్కిల్' సినిమా రిలీజ్‌కు అడ్డంకులు తొలగిపోయాయని ఆనందంగా ఉన్న ఆయన.. ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు.
పాకిస్థాన్ నటీనటులు నటించిన ఏ చిత్రాన్ని కూడా తమ థియేటర్లలో ప్రదర్శించబోమని థియేటర్ యజమానులు తేల్చి చెప్పారు. పైగా, ఈ సినిమా విడుదలకు ఎట్టి పరిస్థితుల్లోను సహకరించబోమంటూ భీష్మించి కూర్చొన్నారు. దీంతో, కరణ్ సినిమా కష్టాలు మళ్లీ మొదటికొచ్చాయి.
తన సినిమా విడుదలకు సహకరించాలంటూ కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ను ఢిల్లీలో కలిసి కరణ్ విన్నవించాడు. అనంతరం శనివారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్ సమక్షంలో ఎమ్మెన్నెస్ అధినేత రాజ్ థాకరేతో చర్చలు జరిపి, సినిమా విడుదలకు అడ్డంకులను తొలగించుకున్నాడు. ఇకపై పాక్ నటులకు తన సినిమాల్లో అవకాశం ఇవ్వనని, ఆర్మీ వెల్ఫేర్ ఫండ్‌కు రూ.5 కోట్లు ఇస్తానని హామీ ఇచ్చాడు. దీంతో, రాజ్‌థాకరే కూడా సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.