శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 4 ఫిబ్రవరి 2021 (15:54 IST)

ఆప్ఘనిస్థాన్ బ్యూటీపై మనసుపడిన కళ్యాణ్ రామ్

టాలీవుడ్ హీరోల్లో కళ్యాణ్ రామ్ ఒకరు. ఒకవైపు, హీరోగా రాణిస్తూనే, మరోవైపు నిర్మాతగా పలు చిత్రాలు నటిస్తున్నారు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ ఫాంట‌సీ డ్రామా నేప‌థ్యంలో ఓ సినిమాకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి "రావ‌ణ" అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. 
 
ఎన్టీఆర్ ఆర్ట్స్‌పై క‌ల్యాణ్‌రామ్ స్వ‌యంగా నిర్మించే ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త ప్ర‌స్తుతం ఫిలింన‌గ‌ర్‌లో చ‌క్క‌ర్లు కొడుతుంది. ఈ ప్రాజెక్టులో ఐటెంసాంగ్ ఉండ‌గా.. అప్ఘాన్ బ్యూటీ వ‌రీనా హుస్సేన్ క‌ల్యాణ్‌రామ్‌తో క‌లిసి స్టెప్పులేయ‌నుంద‌ట‌.
 
ఈమె ఇప్పటికే బాలీవుడ్‌లో ఎంటరైంది. అక్కడ 'వ‌రీనా హుస్సేన్ లవ్‌యాత్రి', 'ద‌బాంగ్‌ 3' వంటి చిత్రాల్లో అందాలు ఆరబోసింది. తాజాగా ఐటెంసాంగ్‌తో ద‌క్షిణాది సినీ ప‌రిశ్ర‌మ‌కు ఎంట్రీ ఇవ్వనుంది. వ‌రీనా హుస్సేన్ సాంగ్‌పై చిత్ర‌యూనిట్ నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. 
 
పాన్ ఇండియా ట‌చ్ ఇస్తూ హైబ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించేందుకు స‌న్నాహాలు చేస్తున్న ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ రావణుడుగా కనిపించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.