1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : గురువారం, 4 ఫిబ్రవరి 2021 (15:21 IST)

థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లో రాజ్ త‌రుణ్ `ప‌వ‌ర్‌ప్లే`

మార్చి5న విడుద‌ల‌

హీరో రాజ్ త‌రుణ్, ద‌ర్శ‌కుడు కొండా విజ‌య్ కుమార్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న లేటెస్ట్ మూవీ  `పవర్ ప్లే`.  శ్రీ‌మ‌తి ప‌ద్మ స‌మ‌ర్ప‌ణ‌లో వ‌న‌మాలి క్రియేష‌న్స్ ప్రై.లి ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా రూపొందుతోన్నఈ చిత్రాన్ని మ‌హిద‌ర్‌, దేవేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్‌మోష‌న్ పోస్ట‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ చిత్రాన్ని స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌గా మార్చి 5న గ్రాండ్‌గా విడుద‌ల‌చేయ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ ప్ర‌సాద్‌ల్యాబ్‌లో ఏర్పాటుచేసిన ట్రైల‌ర్ రిలీజ్ కార్య‌క్ర‌మంలో `పవర్ ప్లే` ట్రైల‌ర్‌ను మీడియా త‌రుపున సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్, నిర్మాత సూప‌ర్‌హిట్‌ బి.ఎ.రాజు విడుద‌ల‌చేశారు. 
 
అనంత‌రం రాజ్ త‌రుణ్ మాట్లాడుతూ -  ` `ఒరేయ్ బుజ్జిగా..`లాంటి మంచి ఎంట‌ర్‌టైన‌ర్ త‌ర్వాత మా టీమ్ అంతా క‌లిసి స‌రికొత్త జోన‌ర్‌లో చేస్తోన్న డిఫ‌రెంట్ థ్రిల్ల‌ర్ స‌బ్జెక్ట్ ఇది. విజ‌య్‌గారు, నంద్యాల ర‌వి, మ‌ధునంద‌న్ క‌లిసి అద్భుత‌‌మైన‌  స్క్రిప్ట్ రెడీ చేశారు. హేమ‌ల్ అమేజింగ్ కో- స్టార్‌. త‌న‌కి ఈ సినిమా మంచి పేరు తేవాల‌ని ఆశిస్తున్నారు. అలాగే మా నిర్మాత దేవేష్ గారు  మా అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటూ సినిమాకి ఏం కావాలో అన్ని స‌మ‌కూర్చారు. అలాగే అనంత్ సాయి గారు చాలా హెల్ప్ చేశారు. పూర్ణ‌గారు ఫ‌స్ట్‌టైమ్ ఒక‌ ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో కనిపిస్తారు. సురేష్ బొబ్బిలి మంచి సంగీతంలో పాటు అదిరిపోయే ఆర్ ఆర్ ఇచ్చారు. ఈ అవ‌కాశం ఇచ్చిన విజ‌య్‌గారికి స్పెష‌ల్ థ్యాంక్స్‌. త్వ‌ర‌లో మేం ఇద్ద‌రం క‌లిసి మ‌రో స‌ర్‌ప్రైజ్ ఇవ్వ‌బోతున్నాం. ప‌వ‌ర్‌ప్లే సినిమా మార్చి 5న విడుద‌ల కాబోతుంది. త‌ప్ప‌కుండా మీఅంద‌రికీ న‌చ్చుతుంది. ద‌య‌చేసి థియేట‌ర్‌లోనే సినిమా చూడండి`` అన్నారు.
 
చిత్ర ద‌ర్శ‌కుడు విజ‌య్ కుమార్ కొండా మాట్లాడుతూ- ``పీక్ లాక్‌డౌన్ స‌మ‌యంలో ఒరేయ్ బుజ్జిగా టీమ్ అంద‌రం క‌లిసి ఒక సినిమా చేద్దాం డైసైడ్ అయ్యాం. అనంత్ సాయి చెప్పిన పాయింట్ మా అంద‌రికీ న‌చ్చి చాలా నిజాయితీగా అన్ని క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో ఒక ప‌ర్ఫెక్ట్ సినిమా చేయాల‌ని ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయ‌డం జ‌రిగింది. రాజ్ ఇంత‌వ‌ర‌కూ చేయ‌ని ఒక కొత్త జోన‌ర్‌లో ఈ సినిమా ట్రై చేశాడు. డెఫినెట్‌గా మీ అంద‌రికీ న‌చ్చుతుంది. పూర్ణ‌గారు ఈ సినిమాలోఒక ఇంపార్టెంట్ క్యారెక్ట‌ర్ చేయ‌డం జ‌రిగింది. మోస్ట్ ప‌వ‌ర్‌ఫుల్ క్యారెక్ట‌ర్ కావ‌డంతో పూర్ణ‌గారిని సెలెక్ట్ చేశాం. త‌ప్ప‌కుండా త‌న‌కి మంచి పేరు తెస్తుంది. ఈ సినిమాలో కోటా శ్రీ‌నివాస‌రావుగారితో వ‌ర్క్ చేసే అవ‌కాశం ల‌భించ‌డం హ్యాపీగా ఉంది. అజ‌య్‌, స‌త్యం రాజేష్‌, మ‌ధునంద‌న్ ఇలా చాలా మంది ఆర్టిస్టులు ఈ సినిమా కోసం వ‌ర్క్ చేశారు. మ‌ధునంద‌న్ స్క్రిప్ట్ విష‌యంలో కూడా హెల్ప్ చేశాడు. ఆండ్రూ గారు త‌న సినిమాల‌కి విభిన్నంగా ఈ సినిమా చేశారు``` అన్నారు.
 
చిత్ర నిర్మాత దేవేష్ మాట్లాడుతూ  - ``ఈ సినిమా ఒక అమేజింగ్ ఎక్స్‌పీరియ‌న్స్‌. రాజ్‌త‌రుణ్‌గారు, హేమ‌ల్‌, పూర్ణ ఇలా  ప్ర‌తి ఒక్క‌రూ చాలా బాగా న‌టించారు. విజ‌య్‌గారు అద్భుతంగా ఈ సినిమాని తెర‌కెక్కించారు. మేమంద‌రం ఒక ఫ్యామిలి మెంబ‌ర్స్‌లా క‌లిసి పనిచేశాం. అంద‌రి ఆర్టిస్టులు ప‌వ‌ర్‌ప్యాక్డ్ పెర్‌ఫామెన్స్ లు ఈ సినిమాలో చూడొచ్చు. ప‌వ‌ర్‌ప్లే ఒక ప‌వ‌ర్‌ఫుల్ ప్లే`` అన్నారు.
 
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ ప‌ల‌ప‌ర్తి అనంత్ సాయి మాట్లాడుతూ - ``మేం అడ‌గ‌గానే ఈ సినిమా చేసిన విజ‌య్‌గారికి థ్యాంక్స్‌. లాక్‌డౌన్ అయిపోయిన వెంట‌నే రెండు రోజుల్లో సినిమా  స్టార్ట్ చేశారు. ప్ర‌తి ఒక్క‌రు చాలా బాగా న‌టించారు. సినిమా చాలా బాగా వ‌చ్చింది. త‌ప్ప‌కుండా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తుంది`` అన్నారు.
 
రైట‌ర్‌ నంధ్యాల‌ర‌వి మాట్లాడుతూ - ``ఈ సినిమాకి క‌థ‌, మాట‌లు రాయ‌డం జ‌రిగింది. ఇప్ప‌టివ‌ర‌కు అన్ని ఎంట‌ర్‌టైన్‌మెంట్ స‌బ్జెక్ట్స్ చేశాం. ఫ‌స్ట్ టైమ్ ఒక థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లో ఈ సినిమా చేశాం. సినిమా అంతా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. విజ‌య్‌గారు కొత్త డైమెన్ష‌న్‌లో ఈ సినిమా చేశారు. రాజ్ త‌రుణ్ త‌న హండ్రెడ్ ప‌ర్సెంట్ ఇచ్చారు. సినిమా డెఫినెట్‌గా పెద్ద హిట్ అవుతుంది.
ఈ అవ‌కాశం ఇచ్చిన నిర్మాత‌ల‌కి ద‌న్య‌వాదాలు`` అన్నారు.
 
Poorna, Powe play movie
హీరోయిన్ పూర్ణ మాట్లాడుతూ - ``విజ‌య్‌గారి లాంటి స్వీట్ డైరెక్ట‌ర్‌ని నేను ఇంత వ‌ర‌కూ చూడ‌లేదు. ఒక డైరెక్ట‌ర్ ఇంత కామ్‌గా వ‌ర్క్ చేయ‌డం నేనింత‌వ‌ర‌కూ చూడ‌లేదు. సెట్లో ఎప్పుడు ఆయ‌న టెన్ష‌న్ ప‌డ‌రు. ఈ సినిమాలో నేను ఇప్ప‌టివ‌ర‌కు చేయ‌ని ఒక డిఫ‌రెంట్‌రోల్ చేయ‌డం జ‌రిగింది. నా కెరీర్‌లో ఒక స్పెష‌ల్ రోల్ అవుతుంది. నిర్మాత దేవేష్ గారు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

హీరోయిన్ హేమ‌ల్ మాట్లాడుతూ -  ``ప‌వ‌ర్‌ప్లే సినిమాతో హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మ‌వుతున్నందుకు చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. విజ‌య్‌గారు చాలా కూల్ ఉంటూ సినిమా చాలా బాగా తీశారు. రాజ్ మంచి కో స్టార్. ఆయ‌న‌తో వ‌ర్క్ చేయ‌డం చాలా హ్యాపీగా ఉంది. ఈ అవ‌కాశం ఇచ్చిన ప్రొడ్యూస‌ర్స్‌కి స్పెష‌ల్ థ్యాంక్స్‌`` అన్నారు.
 
మ‌ధునంద‌న్ మా‌ట్లాడుతూ - ``ఇలాంటి ఒక మంచి సినిమాతో నిర్మాత‌లుగా ప‌రిచ‌య‌మ‌వుతున్న నిర్మాతలు మ‌హిద‌ర్‌, దేవేష్ గారికి అభినంద‌న‌లు. మంచి టేస్ట్ ఫుల్ ప్రొడ్యూస‌ర్స్‌. విజ‌య్‌గారి, రాజ్ స్టైల్‌కి విరుద్దంగా ఉంటుంది ఈ సినిమా. మేమంతా ఒక ఫ్యామిలీలా సినిమా కోసం ప‌ని చేయ‌డం జ‌రిగింది``అన్నారు.