ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 30 జులై 2024 (15:31 IST)

మందార పువ్వు టీ బెనిఫిట్స్.. సమంతలా నయన టార్గెట్.. కౌంటరిచ్చింది..!

nayanathara
ఇటీవల సినీ నటి సమంతా హైడ్రోజన్ పెరాక్సైడ్‌తో కూడిన ఆరోగ్య సలహా కోసం వివాదం చిక్కుకున్నారు. దీంతో సమంత సోషల్ మీడియాలో పెద్దగా కనిపించట్లేదు. ప్రస్తుతం దక్షిణాది సూపర్ స్టార్ నయనతార అలాంటి వివాదంలో చిక్కుకుంది. 
 
హైబిస్కస్ టీని దాని ఆరోగ్య ప్రయోజనాల కోసం ప్రశంసిస్తూ ఆమె ఇటీవలి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వివాదాన్ని రేకెత్తించింది. మధుమేహం, మొటిమలతో సహా వివిధ ఆరోగ్య సమస్యలను హైబిస్కస్ టీ పరిష్కరించగలదని ఆమె పేర్కొంది. ఈ టీ గురించి సమంతను వివాదంలోకి లాగిన లివర్ డాక్ అని పిలువబడే సిరియాక్ అబ్బి ఫిలిప్స్ నయనను వదిలిపెట్టలేదు. 
 
మందారపువ్వుపై ఆమె తనకున్న 8.7 మిలియన్ల ఫాలోవర్లను తప్పుదోవ పట్టిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల సమంత తన ఫాలోవర్లను తప్పుదారి పట్టించిన దానికంటే రెండు రెట్లు ఎక్కువగా నయనతార ఆ పని చేస్తోందని మండిపడ్డారు. 
 
మందారపువ్వు డయాబెటిస్, హైబీపీ, యాక్నే, యాంటీ బ్యాక్టీరియల్ అంటూ నయనతార చెబుతున్నారని, ఆమె చెప్పిన వాటికి ప్రూఫ్స్ లేవని పేర్కొంటూ, నయనతార పోస్టు ఫొటోలను షేర్ చేశారు. 
Hibiscus Tea
Hibiscus Tea
 
వైద్యుడి విమర్శలపై స్పందించిన నయనతార.. తెలివి తక్కువ వారితో వాదించవద్దు. ఆ విధంగా మిమ్మల్ని వారి స్థాయికి తీసుకెళ్లి ఓడిస్తారు.. అంటూ అమెరికన్ రచయిత మార్క్ ట్వైన్ చెప్పిన సూక్తిని షేర్ చేసింది. అయితే, ఇందులో నేరుగా వైద్యుడిని ప్రస్తావించనప్పటికీ ఆయనను ఉద్దేశించే నయన్ ఈ వ్యాఖ్యలు చేసిందని అంటున్నారు.