1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 27 జూన్ 2024 (17:00 IST)

డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు వస్తున్న అగ్నిసాక్షి

Arjun, Aishwarya
Arjun, Aishwarya
డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ ఫస్ట్ టైమ్ లాంగ్ ఫార్మేట్ షోగా అగ్ని సాక్షి స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. జూలై 12వ తేదీ నుంచి అగ్నిసాక్షి స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది. ఈ షోలో పాపులర్ టెలివిజన్ జంట అర్జున్ అంబడి, ఐశ్వర్య నటిస్తున్నారు. డ్రామాతో కూడిన ఇంటెన్స్ స్టోరీలైన్, పవర్ పుల్ పర్ ఫార్మెన్స్ లతో అగ్నిసాక్షి ప్రేక్షకుల్ని ఆకట్టుకోనుంది.
 
డెడికేటెడ్ పోలీస్ ఆఫీసర్ శంకర్ గా అర్జున్ అంబడి, జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయిన యువతి గౌరి పాత్రలో ఐశ్వర్య కనిపించనున్నారు. ఒక మిస్టీరియస్ మర్డర్ కేసు ఈ జంట జీవితాన్ని మలుపుతిప్పుతుంది. సస్పెన్స్, ఎమోషన్, ట్విస్టులతో అగ్నిసాక్షి ఆద్యంతం ఆసక్తికరంగా సాగనుంది. అగ్నిసాక్షికి అన్ని వర్గాల ప్రేక్షకుల మంచి రెస్పాన్స్ వస్తుందని డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ ఆశిస్తోంది.