మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 10 డిశెంబరు 2021 (17:02 IST)

అఖండ ప్రభంజనం.. 14.8 కోట్ల షేర్‌

'అఖండ' భారీ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాలో బాలకృష్ణను బోయపాటి అఘోరగా చూపించనున్నాడనే టాక్ వచ్చినప్పుడు అంతా షాకయ్యారు.

బోయపాటి 'అఘోర'గా బాలకృష్ణ పాత్రను గొప్పగా డిజైన్ చేశాడు. బాలకృష్ణ కెరియర్లోనే బెస్ట్ గెటప్పుగా సినీ ప్రముఖులు సైతం చెప్తున్నారు. 
 
ఈ సినిమాకు కథాకథనాలు .. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి బలమైన ఆకర్షణగా నిలిచాయి.  విడుదలైన తొలి రోజు నుంచి ఈ సినిమా నైజామ్ లో భారీ వసూళ్లను రాబడుతూ వెళుతోంది. 
 
ఈ నెల 2వ తేదీన విడుదలైన ఈ సినిమా, వారం రోజుల్లో నైజామ్‌లో 14.8 కోట్ల షేర్‌ను రాబట్టిందని చెప్తున్నారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చిన సంగతి తెలిసిందే.