శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 30 ఆగస్టు 2022 (10:06 IST)

అక్కినేని నాగార్జున ప్రామిస్ చేశారు దేనికంటే..

Akkineni Nagarjuna,
Akkineni Nagarjuna,
అక్కినేని నాగార్జున పుట్టిన‌రోజు ఈనెల 29న జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు ఊపిరిస‌ల‌ప‌ని విధంగా అభిమానులు, స‌న్నిహితులు, స్నేహితులు శుభాకాంక్ష‌లు తెలిపారు. అదేవిధంగా ఈరోజు అంటే మంగ‌ళ‌వారం నుంచి త‌న‌కు వ‌చ్చిన ఫోన్ కాల్స్‌, సోషల్ మీడియాలో వ‌చ్చిన సందేశాల‌ను ఆయ‌న చెబుతూ చాలా ఖుషీగా వున్నారు.
 
ఈ విష‌యాన్ని ఆయ‌న చిన్న వీడియోలో తెలియజేశారు. ఈవేళ పొద్దునుంచీ నాకు వ‌స్తున్న ఫోన్‌కాల్స్‌, మెసేజ్‌లు, సోష‌ల్‌మీడియాలోనూ మెసేజ్‌లు చేసిన వారందికీ హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నారు. ఈ నుంచి వ‌స్తున్న అమోజింగ్ ప్రేమ ఇలానేవుండాల‌ని కోరుకుంటున్నాను. ఈ సెప్టెంబ‌ర్‌, అక్టోబ‌ర్ రెండు నెల‌లు నాకు చాలా ప్ర‌త్యేక‌మైన‌వి. మూడు ఈమోజింగ్ ఈవెంట్స్ మీముందుకు తేబుతున్నాను. అందులో ఒక‌టి బిగ్‌బాస్‌తో మిమ్మ‌ల్ని అల‌రించ‌బోతున్నాం. అదేవిధంగా బ్ర‌హ్మాస్త్ర సినిమా రాబోతుంది, ది ఘోస్ట్ అనే చిత్రం రాబోతుంది. ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్‌కు మీ నుంచి వ‌చ్చిన స్పంద‌న వెల‌క‌ట్ట‌లేనిది. ఇలాగే మీ ప్రేమ నామీద వుండాలి. అందుకే నేను మీకు మంచి ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇస్తాన‌ని ప్రామిస్ చేస్తున్నాన‌ని పేర్కొన్నారు.