బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 3 డిశెంబరు 2024 (16:10 IST)

బాలీవుడ్‌ సినిమా వెల్‌కమ్‌ టు ఆగ్రా లో అలీ

Welcome to Agra opeing in mumbai
Welcome to Agra opeing in mumbai
దాదాపు 1250 సినిమాలకు పైగా నటించిన అలీ కెరీర్‌లో హీరోగా 52 సినిమాల్లో నటించారు. భారతదేశంలోని అన్ని భాషల్లో అలీ తనదైన శైలిలో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. మ్యాడ్‌ ఫిలిమ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ఆశిష్‌ కుమార్‌ దూబే రచించి దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘వెల్‌కమ్‌ టు ఆగ్రా’. ఈ సినిమా ప్రారంభోత్సవంలో భాగంగా ముహూర్తపు సన్నివేశాల్ని ముంబైలో చిత్రీకరించారు. 
 
ఈ సందర్భంగా నటుడు అలీ మాట్లాడుతూ–‘‘ ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రా కేంద్రంగా జరిగే ప్రేమకథ ఈ సినిమా. ఈ సినిమాలో మెయిన్‌రోల్‌లో నన్ను ఎన్నుకున్నందుకు నిర్మాతకు, దర్శకునికి నా కృతజ్ఙతలు తెలియచేస్తున్నా. గతంలో అనేక సినిమాల్లో సల్మాన్‌ఖాన్‌ పక్కన అనేకమంది హీరోల పక్కన క్యారెక్టర్‌ యాక్టర్‌గా నటించాను. ఈ సినిమాలో ఫుల్‌లెంగ్త్‌ ఉన్న పాత్ర చేయటం ఎంతో ఆనందంగా ఉంది’’ అన్నారు. అనుషమాన్‌ఝా, సారా అంజలి, ఆకాశ్‌ ధబాడే, రౌనక్‌ ఖాన్, ఫైజల్‌ మాలిక్, అంచల్‌ గాంధీ, కైరా చౌదరి తదితరులు నటిస్తున్నారు.